పవన్ తో సుదీప్ భేటీ

Kannada Super Star Sudeep Meets Power Star Pawan Kalyan At Jana Sena Party Office

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కన్నడ స్టార్ హీరో సుదీప్ కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా కోసం వీరిద్దరూ భేటీ అయ్యారా..? నార్మల్ గానే భేటీ అయ్యారా? అని ఇప్పటికే పలు వార్తలు వచ్చేసాయి. అయితే వీరిద్దరూ క్యాజువల్ గానే మీట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఇద్దరూ సినిమాలు.. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్స్ చేయడం.. ఇంకా సామాజిక అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం. మరి ఎందుకు కలిసారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ, హరీష్ శంకర్ తో మరో సినిమా అలాగే సురేందర్ రెడ్డి తో చేస్తోన్న సంగతి కూడా విదితమే.

మరోవైపు అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఫాంటమ్ కన్నడ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో విక్రాంత్ రోనా అనే పాత్ర పోషిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.