ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 32
వీక్లీ రౌండప్ - టాలీవుడ్ అప్ డేట్స్
'ముత్తయ్య మురళీధరన్' బయోపిక్ కు టైటిల్ ఫిక్స్
రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
రాజమౌళి పై 'RRR' టీమ్ ఫిర్యాదులు
జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్

'ఈవారం' ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్
మళ్లీ జన్మలో నువ్వే కూతురిగా పుట్టాలి

నవంబర్ లో "RRR" షూటింగ్ లో అలియాభట్
కీర్తి సురేష్ ఫొటో షూట్
సెట్స్ లో అందరితో కలసిపోతా -నివేత పేతురాజ్

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్
అఫీషియల్.. ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి
మహేష్ - త్రివిక్రమ్ సినిమా.. ట్వీట్ తో హింట్
హాలీవుడ్ మూవీ గా యండమూరి"ఆనందో బ్రహ్మ "
'ఆర్ఆర్ఆర్' షూట్ కోసం వెయిటింగ్

'వకీల్ సాబ్' సెట్ లో నివేదా
అవును మాకు కరోనా పాజిటివ్ వచ్చింది
కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. ఇక ఇప్పుడు మరో హీరో కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అది ఎవరిదో కాదో రాజశేఖర్ ఫ్యామిలీ. రాజశేఖర్, జీవిత కరోనా బారిన పడ్డారని.. గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్.
'సర్కారు వారి పాట' టీమ్ మీకు స్వాగతం చెపుతుంది
ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమా పరుశురాం తో చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్టు ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలకు బ్రేక్ పడింది. మహేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
వీక్లీ రౌండప్ - టాలీవుడ్ అప్ డేట్స్
నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా… ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా `చెక్` యూనిట్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ విషయాన్ని నితిన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
800 పై క్లారిటీ - ఈ సినిమాకు.. రాజకీయాలకు సంబంధం లేదు
శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బౌలింగ్ గురించిన మెళకువలు నేర్చుకుంటున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో ముత్తయ్యగా విజయ్ లుక్ చూసి ఒక రకంగా అందరూ షాకయ్యారు. ముత్తయ్య మురళీధరన్ లుక్ ను దించేశాడు విజయ్
'ముత్తయ్య మురళీధరన్' బయోపిక్ కు టైటిల్ ఫిక్స్
సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు రీసెంట్ గా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆయన బౌలింగ్ శైలితోపాటు మ్యానరిజమ్స్‌ను ను కూడా నేర్చుకునే పనిలో పడినట్టు సమాచారం.
రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
అపజయం ఎరుగని దర్శక ధీర రాజమౌళి బర్త్ డే ఈ రోజు . రాజమౌళి ఈ రోజు తో 47 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 48 వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. దర్శకుడు రాజమౌళి కి సినీ ప్రముఖుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ గురించి తెలుసుకుందాం. సూపర్ హిట్ "స్టూడెంట్ నెం 1 " మూవీ తో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన రాజమౌళి బ్లాక్ బస్టర్ "సింహాద్రి మూవీ తో భారీ విజయాన్ని సాధించారు. సూపర్ హిట్ "సై " మూవీ తో రాజమౌళి హ్యాట్రిక్ సాధించారు.
రాజమౌళి పై 'RRR' టీమ్ ఫిర్యాదులు
ఒక్కో సినిమాను రాజమౌళి ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడో అందరికీ తెలుసు. ఒక శిల్పాన్ని ఎంతో జాగ్రత్తగా ఎలా చెక్కుతారో అలా చెక్కుతాడు కాబట్టే ఆయనకు జక్కన్న అన్న పేరు పెట్టారు. అలా ఉంటాడు కాబట్టే మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కారణమయ్యాడు. దేశం గర్వించదగ్గ దర్శకుడు అయ్యాడు. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు సినీ ప్రముఖుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విచిత్రం ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీరియస్ గా ఏం కాదులెండి కామెడీగా. సెట్స్ లో రాజమౌళి బర్త్‌డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు ఆయన సెట్‌లో ఎలా ఉంటారనే…
జక్కన్నకు 'RRR' టీమ్ బర్త్ డే విషెస్
`బాహుబలి`సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకదిగ్గజం రాజమౌళి. ఇక ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటులు కూడా జక్కన్నకు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ అందించారు.

'ఈవారం' ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్
గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.
మళ్లీ జన్మలో నువ్వే కూతురిగా పుట్టాలి
మంచు వారసురాలిగా మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ రోజు మంచు లక్ష్మీ పుట్టినరోజు కావడంతో మంచు లక్ష్మీని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా `. `వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ, ఉంటే మళ్లీ ఈ లక్ష్మి ప్రస్నన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాలను ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు` అని తాను లక్ష్మీని ఎత్తుకున్న చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.
'మోసగాళ్లు' - రుహీ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.

నవంబర్ లో "RRR" షూటింగ్ లో అలియాభట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
కీర్తి సురేష్ ఫొటో షూట్
తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 6నెలల తరువాత కీర్తి "రంగ్ దే!"మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కీర్తి సురేష్ నటించిన "మిస్ ఇండియా "," గుడ్ లక్ సఖి ", "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి హీరోయిన్ గా రెండు తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.
సెట్స్ లో అందరితో కలసిపోతా -నివేత పేతురాజ్
"మెంటల్ మదిలో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కోలీవుడ్ నటి నివేత పేతురాజ్ "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో .. "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత కథానాయికగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో సాయితేజ , దేవాకట్టా కాంబినేషన్ మూవీ "#SDT 14"లో నివేత కథానాయికగా ఎంపిక అయ్యారు.

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్
సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీకి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమాకే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా ఒక మూలస్తంభం అయిన మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరుకి తనయుడు మెగా పవర్ స్టార్ కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత స్టార్, సూపర్ స్టార్ లైనా పిల్లలకు సాధారణ మనుషులే. మరి ఇక మెగా పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగినా కూడా చిరు మాత్రం ఎప్పటికీ తనకు ముద్దుల కొడుకే. పలు సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పిక్స్ ను చూద్దాం..
అఫీషియల్.. ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి
ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఆయనెవరో కాదు... సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
మహేష్ - త్రివిక్రమ్ సినిమా.. ట్వీట్ తో హింట్
త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమాను అంత తొందరగా ఎవరూ మర్చిపోరు. అప్పటిదాకా మహేష్ లో అంత కామెడీ యాంగిల్ ఉందని త్రివిక్రమ్ చూపించేంత వరకూ ఎవరికీ తెలీదు. అందుకే కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ సినిమాను అంతగా ఇష్టపడతారు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిజం వైవిధ్యంగా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగులు.. సునీల్, ఆలీ కామెడీ ఇలా ప్రతి అంశం మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట పాటలు వినిపిస్తూనే ఉంటాయి.
హాలీవుడ్ మూవీ గా యండమూరి"ఆనందో బ్రహ్మ "
స్టార్ రైటర్ యండమూరి వీరేంద్ర నాథ్ తన నవలలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. యండమూరి నవలలో "ఆనందో బ్రహ్మ " తప్ప మిగతా నవలలు అన్నీ సినిమాలు గా రూపొందాయి. చిరంజీవి , బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కాయి. 30 సినిమాలకు పైగా యండమూరి రచనా సహకారాన్ని అందించారు. స్టేట్ సాహిత్య అకాడమీ , రెండు నంది అవార్డ్స్ అందుకున్న యండమూరి దర్శకుడిగా రెండు మూవీస్ కు దర్శకత్వం వహించారు. ఇప్పుడు యండమూరి నవల "ఆనందో బ్రహ్మ " హాలీవుడ్ మూవీ గా తెరకెక్కనుంది.
'ఆర్ఆర్ఆర్' షూట్ కోసం వెయిటింగ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఇన్నిరోజులకు హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించారు.

'వకీల్ సాబ్' సెట్ లో నివేదా
మొత్తానికి సినీపరిశ్రమకు ఇప్పుడిప్పుడే కళ వస్తుంది. అందరూ షూటింగ్స్ ను మళ్ళీ మొదలుపెడుతున్నారు. ఇక థియేటర్స్ కూడా కొద్దిరోజుల్లో తెరుచుకోనున్న నేపథ్యంలో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే.. రీసెంట్ గానే వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.