
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 34

త్వరలో "రంగ్ దే ! సెట్స్ లో కీర్తి సురేష్
నివేత పేతురాజ్ గిటార్ స్కిల్స్
వర్మ 'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ రిలీజ్
ఆ సినిమా కోసమే గుండు లుక్ ట్రై చేశాం ..!
జీవితం విలువ తెలిసింది - మెహరీన్
ఆమె పాత్రలో నటించడం గౌరవంగా ఉంది
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్
ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా
శుభ్రత మంచిదే - మెహరీన్
సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
విశ్వక్ సేన్ ఫీలింగ్స్
'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్
సితార తీసిన ఫొటో - ప్రేమ నిజమైంది
విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్
'అల్లుడు అదుర్స్' కూడా మొదలు

#PSPK28.. ఆ సైలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ మాత్రం ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. కారణం ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమా అయిపోయిన తర్వాత క్రిష్ తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ సినిమా మొదలుకానుంది.
త్వరలో "రంగ్ దే ! సెట్స్ లో కీర్తి సురేష్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , రోహిణి , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ ఈ మూవీ కి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నివేత పేతురాజ్ గిటార్ స్కిల్స్
సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠ పురములో " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నివేత ప్రేక్షుకులను అలరించారు. నివేత నటించిన యాక్షన్ థిల్లర్ "RED "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేత టాలీవుడ్ లో పలు మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు.
వర్మ 'దిశ ఎన్కౌంటర్' ట్రైలర్ రిలీజ్
సమాజంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో సంచలన కథతో రాబోతున్నాడు వర్మ. గత ఏడాది దిశ హత్యాచారం సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్కౌంటర్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశాడు వర్మ. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు అన్నీ ట్రైలర్ లో చూపించాడు.
వీక్లీ రౌండప్ (సెప్టెంబర్ 21-25) - లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.
ఆ సినిమా కోసమే గుండు లుక్ ట్రై చేశాం ..!
ఇటీవల అర్బన్ మాంక్ లుక్ తో మెగా స్టార్ చిరంజీవి మొత్తం సోషల్ మీడియానే షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ మేకింగ్ వీడియోను 'మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్' పేరుతో ఇటీవలే తన ఇన్‌స్టా లో విడుదల చేసి గుండు చేయించుకోలేదని చిరు కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు ఈ లుక్ ఎందుకు..? ఏదైనా సినిమా కోసమా..? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ ఇంకా ఉంది. అయితే 'వేదాళం' రీమేక్ కోసమే ఈ గుండు లుక్‌ను ప్రయత్నిస్తున్నారని టాక్ కూడా వినిపించింది. ఇక లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన గుండు లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. 'వేదాళం' రీమేక్ కోసమే గుండు లుక్‌ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని…
జీవితం విలువ తెలిసింది - మెహరీన్
తెలుగు తోపాటు తమిళ , పంజాబీ భాషల చిత్రాలతో మెహరీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సక్సెస్ ఫుల్ "కృష్ణగాడి వీర ప్రేమ గాథ " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన మెహరీన్ "మహాను భావుడు ", రాజా ది గ్రేట్ ", "F2 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒత్తిడికి లోనవుతూ చాలామంది ప్రజలు డిప్రెషన్ కు గురి అవుతూ , అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఆమె పాత్రలో నటించడం గౌరవంగా ఉంది
ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
చిరు క్లారిటీ.. అందుకే సుజీత్ ప్లేస్ లో వినాయక్
ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టాలని.. ముందు రామ్ చరణ్ తో వున్న సీన్స్ పూర్తి చేయాలనీ భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "RRR" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "ఆచార్య " మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
ఆయనతో సినిమా అంటే ఎగిరి గంతేశా
సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఒక ప్లేస్ ను సొంతం చేసుకోవడం కష్టం. ఒకసారి మంచి నటిగా పేరు వచ్చిన తర్వాత అవకాశాలు అవే వచ్చేస్తాయి. ఇక టాప్ పొజిషన్ కు చేరుకున్న తర్వాత స్టార్ హీరోలు సరసన నటించాలని అనుకుంటారు. ఇంకా దిగ్గజాలు కమల్, రజినీతో కలసి నటించడం అంటే అంత కంటే అదృష్టం లేదు అని భావిస్తారు. కానీ అలాంటి అరుదైన అవకాశాలను అందుకున్న వారిలో యువ కథానాయిక నివేదా థామస్ కు చాలా తొందరగానే వచ్చిందని చెప్పొచ్చు. ఐదేళ్ళ గ్యాప్ లో ఈ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది నివేదా. యాదృచ్చికం ఏంటంటే రెండు సినిమాల్లోనూ కూతురిగా నటించే అవకాశం దక్కడం గమనార్హం.
శుభ్రత మంచిదే - మెహరీన్
సక్సెస్ ఫుల్ "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మెహరీన్ "మహానుభావుడు ", "రాజా ది గ్రేట్ ", "F 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగు లోనే కాకుండా తమిళ , హిందీ , పంజాబీ భాషల చిత్రాలలో నటించిన మెహరీన్ తనకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు.
"మహాసముద్రం " మూవీ లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్
సూపర్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి ఆ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ తరువాత అజయ్ భూపతి ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "మహాసముద్రం " ను రూపొందించనున్నారు. ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా "మహాసముద్రం " మూవీ రూపొందనుంది . ఈ మూవీ లో హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
సెప్టెంబర్ 22.. నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
చిరంజీవి నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇంత స్థాయికి ఎదిగారు కాబట్టి ఎంతో మంది నటీ నటులకు ఆయన స్ఫూర్తి. మొదట కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా పరిచయమై మెగా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఇక చిరు మొదట నటించిన `ప్రాణం ఖరీదు` సినిమా 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. దీనితో ఈ సినిమాను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు చిరు.
విశ్వక్ సేన్ ఫీలింగ్స్
"ఈ నగరానికి ఏమైంది " మూవీ తో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ యాక్షన్ థ్రిల్లర్ "ఫలక్ నుమా దాస్ " మూవీ తో దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ "HIT- ది ఫస్ట్ కేస్ " మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ సేన్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం "పాగల్ ", "HIT" మూవీ సీక్వెల్" HIT 2" మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక వారంరోజులలో షూటింగ్ లో పాల్గొనే విశ్వక్ సేన్ ఫీలింగ్స్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.
సితార తీసిన ఫొటో - ప్రేమ నిజమైంది
టాలీవుడ్ లో ఉన్న వన్ అఫ్ ద పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ కపుల్స్ లో మహేష్ అండ్ నమ్రత పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక మహేష్ బాబు అయితే ఫుల్ ఫ్యామిలీ పర్సన్. షూటింగ్ లు లేకపోయినా.. షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంట్లో వాళ్ళతోనే స్పెండ్ చేస్తాడు. ఇక ఈ లాక్ డౌన్ వల్ల చాలా ఖాళీ టైం దొరికింది. చక్కగా పిల్లలతో ఆట పాటలతో సినిమాలు చూస్తూ జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వాటికి సంబంధించిన ఫొటోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో పిక్ పోస్ట్ చేసింది. అయితే ఈ సారి మహేష్ తను వున్న ఫొటో పోస్ట్ చేస్తూ.. ప్రేమపై తనకున్న అవగాహన…
విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్
"వెళ్ళిపోమాకే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ "ఈ నాగరానికి ఏమైంది " మూవీ తో గుర్తిపు పొందారు. సక్సెస్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ "ఫలక్ నుమా దాస్ "మూవీ తో విశ్వక్ సేన్ నటుడు గానే కాకుండా దర్శకుడిగా ప్రతిభను చూపారు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ "HIT - ది ఫస్ట్ కేస్ " మూవీ లో విశ్వక్ సేన్ పోలిస్ ఆఫీసర్ గా అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
'అల్లుడు అదుర్స్' కూడా మొదలు
ధైర్యం చేసి టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ లు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోలు షూటింగ్ కూడా మొదలుపెట్టి పూర్తి చేసారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరో సెట్స్ లోకి అడుగుపెట్టేసాడు. కరోనా కారణంగా ఆగిన ఈ షూటింగ్ ను ఈ రోజు నుండి మొదలు పెట్టారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తిచేసి.. ఈ సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి అప్పటిలోపు థియేటర్స్ ఓపెన్ అవుతాయా.. లేకపోతే ముందే ఓపెన్ చేస్తారా చూడాలి..!
"మోసగాళ్ళు " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో వాస్తవ సంఘటనల ఆధారంగా అతి పెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ ముగింపు దశలో ఉన్న "మోసగాళ్ళు " మూవీ కి నివాస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.