అలియాపై క్లారిటీ తో రాజమౌళి

SS Rajamouli Gives Clarity Regarding Casting Of Alia Bhatt In RRR

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజమ్ పై ఎన్ని చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఈ నెపోటిజమ్ అనే కాన్సెప్ట్ వల్ల కొంతమంది బాలీవుడ్ వారసులు కూడా టార్గెట్ అయ్యారన్న సంగతి కూడా తెలుసు. అందులో ముఖ్యంగా అలియా బట్ కూడా ఒకరు. సడక్ 2 కు వచ్చిన డిస్ లైక్స్ ను చూస్తేనే చెప్పొచ్చు పాపం అలియా పై ఎంత ట్రోలింగ్ జరిగిందో. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కూడా అలియా తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి అలియా ప్లేస్ లో ఇంకే హీరోయిన్ ను రీప్లేస్ చేయనని చెపుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల ఒక ఛానల్ తో ఇంట్రాక్ట్ అయిన రాజమౌళి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం.. కానీ దానివల్ల నాకెలాంటి ప్రాబ్లం లేదు.. ఎందుకంటే అలియా చాలా టాలెంటెడ్.. తను ఈ సినిమాకు పర్ఫెక్ట్ సెలెక్షన్.. తన ప్లేస్ ను వేరే హీరోయిన్ తో రీప్లేస్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు.

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను నేటి నుండి ప్రారంభించారు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =