అప్పుడప్పుడు తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన పుస్తకాలను చదవమని.. అలాగే సినిమాలు వెబ్ సిరీస్ ల గురించి కానీ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. గతంలో ‘ఎమోషనల్ ఇంటెలిజన్స్’ పుస్తకం చదవమని మహేష్ సూచించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘డార్క్’ అనే పేరుతో తెరకెక్కిన జర్మన్ వెబ్ సిరీస్‌ను చూశానని, రచన, దాన్ని తీసిన తీరు అత్యద్భుతంగా ఉన్నాయని.. ఆ వెబ్ సిరీస్‌ను చూడాలంటూ తను రెకమండ్ కూడా చేసాడు. ఇక ఇప్పుడు మరో సినిమా గురించి మహేష్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి మహేష్ కు హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అలాంటి మహేష్ ను ఒక సినిమా భయపెట్టింది. ఆ సినిమా ఏంటంటే ‘సోషల్ డైలమా`. నేను చాలా హారర్ సినిమాలు చూశాను. ఆ జోనర్‌కు నేను పెద్ద అభిమానిని. అయితే `నెట్‌ఫ్లిక్స్`లో ఉన్న `సోషల్ డైలమా` హారర్ జోనర్‌లోనే భయంకరమైన సినిమా. ఇప్పటికీ నాకు భయం తగ్గలేదు. తప్పక చూడాల్సిన సినిమా` అని మహేష్ ట్వీట్ చేశాడు. మరి మహేష్ చెప్పిన తర్వాత అభిమానులు ఊరుకుంటారా. ఈపాటికి సగం మంది చూసుండొచ్చు.
I’ve seen many horror films and have been a fan of the genre… ’Social Dilemma‘ on @netflix is the most scariest of them all !! It’s still giving me the chills as I write this… A MUST WATCH! pic.twitter.com/dwP9SlwaMl
— Mahesh Babu (@urstrulyMahesh) October 5, 2020
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్.
ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: