పెళ్లి ఫొటో తో మామను స్మరించుకున్న చిరు

Megastar Chiranjeevi Remembers His Father In Law Allu Ramalingaiah Sharing A Rare and An unseen picture on social media

ఈ రోజు అల్లు రామలింగయ్య 99వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా అల్లు, మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులందరూ ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు గుర్తుగా అల్లు స్టూడియోస్ ను నిర్మించనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లుడు మెగా స్టార్ చిరంజీవి కూడా మామయ్యను సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చిరు తన ట్విట్టర్ లో ”ఆయన పేరు గుర్తురాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మావయ్యగారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు.. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్‌ కూడా. స్వాతంత్య్ర సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి.. గురువు.. అన్నిటిని మంచి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజునాడు ఆయనని స్మరిస్తూ.. వచ్చే సంవత్సరం ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను..” అని . తన పెళ్లిలో అల్లు రామలింగయ్య ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోని షేర్‌ చేశారు.

 

కాగా తన సినీ ప్రయాణంలో 1000 కి పైగా చిత్రాల్లో నటించి హస్యానికి పెద్దపీట వేశారు పద్మశ్రీ ,డాక్ట‌ర్‌ అల్లు రామ‌లింగ‌య్య. తెలుగు సినిమా బతికున్నంతకాలం ఇలాంటి నటీనటులు ఎప్పుడు బ్రతికే వుంటారు. ఇక వచ్చే ఏడాది 2021 సంవ‌త్స‌రంలో శతజయంతి మైల్ స్టోన్ ను అందుకోనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 10 =