‘RRR’ – భీమ్ స‌ర్‌ప్రైజ్ కు ముహూర్తం ఫిక్స్

RRR Team Announce Date For Komaram Bheem Glimpse Release

మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో ఐడియా వచ్చింది కదా. ఇంకేంటి దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. ఈ సినిమా అప్ డేట్ ఇస్తామని మేకర్స్ నిన్న చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలిపారు. అంతేకాదు ఆ వీడియోలో గేట్స్ తెర‌వ‌డం, దుమ్ము ప‌ట్టిన వ‌స్తువుల‌ను దుల‌ప‌డం, లొకేష‌న్ ప‌రిస‌రాల‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంకు సంబంధించిన విజువ‌ల్స్ చూపించారు. అంతేకాదు భీమ్‌కు సంబంధించిన స‌ర్‌ప్రైజింగ్ వీడియోను అక్టోబ‌ర్ 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఈ వీడియో ద్వారా తెలియ‌జేశారు. చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్‌ను జరుపబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

కాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నాడు రాజమౌళి.

మరి రాజమౌళి లాంటి డైరెక్టర్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడు చేశారో అప్పటినుండి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా?చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఎదురుచూపులకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళ్తుంది. మరి చూద్దాం వచ్చే ఏడాది అయినా రిలీజ్ కు మోక్షం కలుగుతుందేమో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − one =