నా కలలు నిజమయ్యాయి.. నా బాస్‌ ఓకే చెప్పారు

Producer Bandla Ganesh To Team Up Once Again With Power Star Pawan Kalyan After Gabbar Singh

గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌, బండ్లగణేశ్‌ కాంబినేషన్‌లో ఇది వరకు తీన్‌మార్‌, గబ్బర్‌ సింగ్‌ సినిమాలు వచ్చాయి. 2015లో విడుదలైన టెంపర్‌ సినిమా తర్వాత బండ్లగణేశ్‌ మరో సినిమాను నిర్మించలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. చాలా గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత బండ్లగణేష్ మళ్లీ నిర్మాతగా మారబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విషయాన్ని బండ్లగణేష్‌ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌కల్యాణ్‌కు ధన్యవాదాలు” అని చెపుతూ పవన్‌కల్యాణ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు బండ్లగణేష్‌. ఇక అప్పుడే వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా తెరకెక్కనుంది. ఎవరు డైరెక్ట్‌ చేస్తారు? అనే వార్తలు మొదలయ్యాయి.

 

పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ తో.. ఆ తర్వాత హరీష్ శంకర్ ఆ తర్వాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయనున్నారు. మరి బండ్ల తో చేయబోయే సినిమా ఎవరితో ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.