పర్ఫెక్ట్ టైమింగ్ అంటే మన హీరోలదే

Tollywood Heroes Once Again Proves To Be Champions With Their Perfect Timing

ఒకప్పుడు లాగ కాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. యంగ్ హీరోస్ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తోడుగా వుంటున్నారు. అంతేకాదు ఒకరి సినిమా ప్రమోషన్స్ లో మరొకరు పాల్గొంటూ అటు సినిమాకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా.. ఫ్యాన్స్ కు కూడా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు.. మీరు కూడా ఫ్రెండ్లీ గా ఉండాలని పరోక్షంగా చెపుతున్నారు. ఇండస్ట్రీలో మహేష్ – తారక్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్, గోపి చంద్ – ప్రభాస్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ – ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.. మంచు మనోజ్ అయితే అందరి కుర్ర హీరోలతో ఫ్రెండ్లీ గా ఉంటాడు. ఇంకా ఇలాంటి ఫ్రెండ్ షిప్పులు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టైమింగ్ లోనూ మన హీరోలది పర్ఫెక్ట్ టైమింగ్ అని చెప్పొచ్చు. ఈ కింద వీడియో చూస్తే ఒప్పుకోక తప్పదు. భరత్ అనే నేను ఆడియో లాంచ్ కు ఎన్టీఆర్ అతిధిగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ ఒకేసారి చేతులు కట్టుకొని ఒకే రకంగా నిలబడ్డారు. ఈ టైమింగ్ ఎన్టీఆర్-మహేష్ ఫ్యాన్స్ కు ట్రీట్ లాంటిదే. అంతేకాదు రవితేజ నేలటికెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ రాగా అక్కడ కూడా వీరిద్దరి టైమింగ్ సూపర్. మరి ఆ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

 

కాగా మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 17 =