పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్”రొమాంటిక్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోడల్ కేతిక శర్మ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మందిరా బేడీ , మకరంద్ , దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. “రొమాంటిక్ ” మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“రొమాంటిక్ ” మూవీ మే నెలలో రిలీజ్ కావాల్సివుండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి, విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్న “రొమాంటిక్ ” మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. థియేటర్స్ పునః ప్రారంభానికై కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో యూత్ ఆడియెన్స్ టార్గెట్ గా రూపొందిన “రొమాంటిక్ ” మూవీని దసరా పండగకు థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తి ని కలిగించాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























