దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకులను అలరించి మీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు. పలు భాషల మూవీస్ కు మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మీనా , రజనీకాంత్ “అన్నాత్తే “(తమిళ ), మోహన్ లాల్ “దృశ్యం 2 ” మూవీస్ లో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోమోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ “దృశ్యం ” మలయాళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. “దృశ్యం “మూవీ పలు భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “దృశ్యం “మూవీ సీక్వెల్ “దృశ్యం 2″మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి 7నెలల తరువాత మీనా పీపీఈ కిట్ ధరించి విమాన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ హీరోయిన్ మీనా మాట్లాడుతూ.. ఈ డ్రెస్ చూస్తుంటే అంతరిక్షానికి వెళుతున్నట్టు అలాగే యుద్ధానికి వెళుతున్న ఫీలింగ్ కలిగిందనీ , ఈ డ్రెస్ తో ప్రయాణం చాలా కష్టమనీ , బయట చల్లగా ఉన్నా ఒకటే ఉక్కబోతనీ, మనకోసం రోజు కష్టపడుతున్నవారందరికీ నా సెల్యూట్ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: