‘ఆర్ఆర్ఆర్’ – ఇప్పుడు మా వంతు

RRR Team Surprise Announcement On Twitter Makes Audience Happy

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన రామ్‌చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది.. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా కొద్దిమందితో వందల మంది అవసరం కాబట్టి ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభించలేదు. జులై లో ట్రయిల్ షూట్ అనుకున్నారు కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ఇన్నిరోజులకు హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను నేటి నుండి ప్రారంభించారు. ఓ మూడు రోజులు టెస్ట్ షూట్ జరుగనుందట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట. ఎన్టీఆర్ పై ప్రోమో వీడియోను చిత్రీకరించడంతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.

ఇక ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఒక అప్ డేట్ ఇచ్చారు. మన పండుగలకు శుభాకాంక్షలు చెపుతూ మేము చేసే ప్రత్యేక పోస్టులు.. అప్ డేట్స్ కోసం మీ క్రియేటివిటీ ని చూపిస్తూ మాపై వ్యంగ్యంగా మీరు చేసే పోస్టులు ఇక చాలు.. మీ ప్రేమతో చంపుతున్నందుకు థ్యాంక్స్.. కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎంటెర్టైన్ మెంట్ చెయ్యడం మా వంతు.. రేపటి వరకూ వేచి ఉండండి అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తమ అధికారిక ట్విట్టర్ లో తెలిపారు. మరి ఆ అప్ డేట్ ఏంటో చూద్దాం..

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.