15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ఫస్ట్ టైమ్ కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో తమన్నా “బోలే చూడియన్ ” మూవీ లో నటిస్తున్నారు. “గుర్తుందా శీతాకాలం ” మూవీ కి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీ “అంధాధున్”తెలుగు రీమేక్ మూవీ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ లో సీనియర్ హీరోయిన్ టబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందనున్న ఈ రీమేక్ మూవీ లో టబు పాత్రలో తమన్నా నటించనున్నారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ .. గతంలో కొన్ని రీమేక్ మూవీస్ లో నటించాననీ , రీమేక్ మూవీస్ అంటే భయం లేదనీ , నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించడానికి సవాల్ గా తీసుకున్నాననీ , ప్రతీ సినిమాను ఛాలెంజ్ గా తీసుకొంటాననీ తమన్నా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: