కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 30

Versatile Actor Suriya Starrer Vaadi Vasal Movie Title Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Suriya,Actor Suriya,Hero Suriya,Suriya Movies,Suriya New Movie,Suriya L
ఫస్ట్ లుక్

సూర్య ‘వాడి వాసల్’ టైటిల్ పోస్టర్ రిలీజ్

మొదటినుండి తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ముందుంటాడు. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకోడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా ఆ విషయం రుజువు చేశాడు కూాడా. ఇప్పుడు మరోసారి అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాడి వాసల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. జల్లికట్టు నేపథ్యంలో ఇది తెరకెక్కబోతోంది. ఈసినిమా కోసం సూర్య ఆ విద్య కూడా నేర్చుకుంటున్నాడు. ఎద్దులతో పోరాడే సన్నివేశాలు సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సూర్య అందుకు తగిన శిక్షణ తీసుకున్నాడట. ప్రస్తుతం షూటింగ్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జాంబిరెడ్డి - ప్రభాస్ చేతుల మీదుగా 'బిగ్ బైట్'

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా స‌జ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'జాంబిరెడ్డి'. మొదటిసారి ఇలాంటి జోనర్లో సినిమా రావడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్టర్లకూ, మోష‌న్ పోస్టర్‌కూ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఆ పనులు కూడా చివరిదశకు వచ్చేసాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' డబ్బింగ్ స్టార్ట్

జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలను చేసుకోకుండా వెళ్తున్నాడు సుశాంత్. చివరిగా తను కనిపించిన సినిమా అల వైకుంఠపురములో. అప్పటివరకూ హీరోగా అలరించిన సుశాంత్.. ఈ సినిమాలో మాత్రం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో నిదానంగా ఉండే పాత్రలో సుశాంత్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సుశాంత్ S. దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించగా.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో బిజీగా షాలిని పాండే

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మహానటి ", "118 "మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని "100%కాదల్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "నిశ్శబ్దం" మూవీ లో ఒకముఖ్య పాత్రలో నటించారు. తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని ఇప్పుడు బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఈవారం టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్స్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ ‌ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌ల‌లో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రీక్యాప్ - ఈవారం టాలీవుడ్ అప్ డేట్స్

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
Weekly Roundup: Checkout The Tollywood Top Movie Updates For This Week
సినిమా వార్తలు

RECAP.. ఈ వారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థాయ్ ల్యాండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయాన్ని మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ టైమ్ స్పెండ్ చేశారు. మహేష్ బాబు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫేస్ ఫిల్టర్స్ తో క్రాక్ సెట్ లో శృతి ఫన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో సిద్ధార్ధ్ కమ్ బ్యాక్ మూవీ "మహాసముద్రం"

సూపర్ హిట్ చిత్ర దర్శకుడి శంకర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన "బాయ్స్ "మూవీ తో సిద్ధార్ధ్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నువ్వొస్తానంటే నేనొద్దంటానా "మూవీ తో సిద్ధార్ధ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సిద్ధార్ధ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "బొమ్మరిల్లు ", "జబర్దస్త్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో సిద్ధార్ధ్ ప్రేక్షకులను అలరించారు. "రంగ్ దే బసంతి ", "ఛష్మే బద్దూర్ "సూపర్ హిట్ హిందీ మూవీస్ లో నటించిన సిద్ధార్ధ్ కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచిన మహేష్ దంపతులు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా వా కార్యక్రమాలు చేసినా పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. గత మూడేళ్ళ కాలంలో మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలని విజయవంతగా చేయించాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి మరో చిన్నారి ప్రాణానికి అండగా నిలిచారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మృణాళిని రవికి భారీ మూవీ ఆఫర్

ఇంజనీర్ అయిన మృణాళిని రవి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తూ , ఫ్రీ టైమ్ లో టిక్ టాక్ &డబ్ స్మాష్ వీడియోస్ ను రూపొందించేవారు. సూపర్ హిట్ "సూపర్ డీలక్స్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన మృణాళిని రవి , "ఛాంపియన్ " మూవీ లో హీరోయిన్ గా నటించారు. సూపర్ హిట్ "గద్దలకొండ గణేష్ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మృణాళిని ప్రస్తుతం "ఎమ్ జి ఆర్ మగన్ ", "జాంగో ", "కోబ్రా ", "పొగరు "(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. మృణాళిని ఇప్పుడు ఒక భారీ మూవీ ఆఫర్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - నాగ్ ఈజ్ బ్యాక్

బిగ్ బాస్ 4- ఈరోజు వీకెండ్.. అందరూ రోజూ బిగ్ బాస్ చూస్తారో లేదో తెలియదు కానీ.. ఈ రోజు మాత్రం రోజూ చూడని వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే హోస్ట్ రావడం.. హౌస్ మేట్స్ ఏమైనా తప్పులు చేస్తే వారికి క్లాసులు పీకడం.. ఎవరెవరికి ఎలాంటి ఇష్యూస్ ఉంటే వాటికి క్లారిటీ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్ కోసం కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఎవరు హోస్ట్ గా వస్తారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఎందుకంటే నాగార్జున షూటింగ్ కోసం మనాలి వెళ్లడమే కారణం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ కు "మోసగాళ్ళు "టీమ్ స్పెషల్ విషెస్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Actress Aishwarya Rajesh Replaces Nivetha Pethuraj In SDT14
సినిమా వార్తలు

#SDT14 - నివేత ప్లేస్ లో ఐశ్వర్యా రాజేష్

దేవా కట్టా దర్సకత్వంలో సాయి తేజ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

TFN Adminవాట్సాప్
Suriya's Aakaasam Nee Haddhu Ra New Poster Out Now
ఫస్ట్ లుక్

"ఆకాశం నీ హద్దురా " న్యూ మోషన్ పోస్టర్ రిలీజ్

2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా " సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా ) మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Gunasekhar About Shaakuntalam Greatness
సినిమా వార్తలు

"శాకుంతలమ్ "గొప్పదనం - గుణ శేఖర్

దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీనటులతో తెరకెక్కిన "రామాయణం "మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "చూడాలని ఉంది ", "ఒక్కడు ", "రుద్రమదేవి "వంటి సూపర్ హిట్ మూవీస్ తో దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకులను అలరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో "హిరణ్య కశ్యప "మూవీ రుపొందాల్సి ఉండగా , గుణశేఖర్ "శాకుంతలమ్ "మూవీ ని అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఈ వారం ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అవ్వకండి

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దీపావళి కానుకగా "ఆకాశం నీ హద్దురా "

తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అధిక ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య నటించిన ప్రతీ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. " గజిని" , "యముడు" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో సూర్య తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సూర్య ఇప్పుడు "ఆకాశం నీ హద్దురా " మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్