బిగ్ బాస్ 4 – నాగ్ ఈజ్ బ్యాక్

King Nagarjuna Is Back To Host Bigg Boss 4 Show

బిగ్ బాస్ 4- ఈరోజు వీకెండ్.. అందరూ రోజూ బిగ్ బాస్ చూస్తారో లేదో తెలియదు కానీ.. ఈ రోజు మాత్రం రోజూ చూడని వాళ్ళు కూడా చూస్తుంటారు. ఎందుకంటే హోస్ట్ రావడం.. హౌస్ మేట్స్ ఏమైనా తప్పులు చేస్తే వారికి క్లాసులు పీకడం.. ఎవరెవరికి ఎలాంటి ఇష్యూస్ ఉంటే వాటికి క్లారిటీ ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం ఎపిసోడ్ కోసం కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఎవరు హోస్ట్ గా వస్తారన్న దానిపై ఇంత వరకూ క్లారిటీ రాలేదు. ఎందుకంటే నాగార్జున షూటింగ్ కోసం మనాలి వెళ్లడమే కారణం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ షూటింగ్ లో వున్నాడు. అందుకే షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే గత వారం కోడలు ఆ భాద్యతలు తీసుకొని హోస్ట్ చేసింది. అంతేకాదు సమంతకు మంచి మార్కులు కూడా పడ్డాయి. మళ్ళీ అదే తరహాలో ఈవారం కూడా సమంత హోస్ట్ బాధ్యతను తన భుజాలపై వేసుకుంటుందా లేదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈరోజు కూడా స్కిప్ చేసి రేపు వీకెండ్ ఎపిసోడ్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. దానికి కారణం ఇంత వరకూ ప్రోమో కూడా రాకపోవడమే.

అయితే ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. నాగార్జుననే ఈవారం హోస్ట్ గా రానున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను స్టార్ మా రిలీజ్ చేయడంతో కన్ఫ్యూజన్ కు తెరపడింది. మరి చూద్దాం ఈరోజు ఎపిసోడ్ లో నాగ్ ఎవరికి ఎలాంటి క్లాస్ పీకుతాడో… ఎలాంటి గేమ్స్ ఆడిస్తాడో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 14 =