దేవా కట్టా దర్సకత్వంలో సాయి తేజ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నివేత పేతురాజ్ ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ వచ్చింది. కరోనా వల్ల సినిమా షెడ్యూల్స్ అన్నీ మారిపోవడంతో ప్రస్తుతం నివేత పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయిందట. దీనితో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సిందే..
ఇదిలా ఉండగా ఇటీవల హీరో విజయ్ దేవరకొండతో కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో కనిపించింది ఐశ్వర్య రాజేష్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
కాగా దీనితో పాటు సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: