మొదటినుండి తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ముందుంటాడు. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకోడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా ఆ విషయం రుజువు చేశాడు కూాడా. ఇప్పుడు మరోసారి అలాంటి సినిమాతోనే వస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాడి వాసల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. జల్లికట్టు నేపథ్యంలో ఇది తెరకెక్కబోతోంది. ఈసినిమా కోసం సూర్య ఆ విద్య కూడా నేర్చుకుంటున్నాడు. ఎద్దులతో పోరాడే సన్నివేశాలు సహజంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సూర్య అందుకు తగిన శిక్షణ తీసుకున్నాడట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A symbol that signifies our History and Bravery, I am extremely delighted and proud to present the Title look of #VaadiVaasal @Suriya_offl @VetriMaaran @gvprakash #VaadiVaasalTitleLook pic.twitter.com/BNDob3Shsv
— Kalaippuli S Thanu (@theVcreations) July 16, 2021
కాగా ఈసినిమాను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. దీనితోపాటు త్వరలోనే సూర్య నటించిన వెబ్ సీరిస్ ‘నవరస’ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అంతేకాకుండా పాండిరాజ్ మూవీలోనూ సూర్య నటిస్తున్నాడు. దీని షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇటీవలే సూర్య తాను తమిళంలో చేసిన ‘సూరారై పొట్రు’ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. మొత్తం మీద ఇటు నటుడిగా, నిర్మాతగానూ ముందుకు సాగుతున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: