ఫేస్ ఫిల్టర్స్ తో క్రాక్ సెట్ లో శృతి ఫన్

Actress Shruti Haasan Makes Fun At Krack Movie Set

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో శృతి హాసన్ చేసిన ఫన్ వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంది. శ్రుతీ హాసన్ గోపీచంద్ మలినేని కొడుకు సాత్విక్ ఇద్దరూ కలిసి కెమెరా లో పేస్ ఫిల్టర్స్ ను వాడి కామెడీ చేశారు. ఇక ఈ వీడియోలో శృతీ,సాత్విక్ లుక్స్ నవ్వుతెప్పించేలా వున్నాయి. ఇక ఈ వీడియోను శృతీ తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా చాలా కామెడీ గా ఉందంటున్నారు నెటిజెన్స్.

 

కాగా చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాస‌న్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 17 =