ఈ వారం ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అవ్వకండి

Dont Miss To Checkout These Top Tollywood Updates Of This Week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. డెక‌రేష‌న్ లైట్స్‌, సోడా బాటిల్స్‌, మ‌ల్లె పూలు క‌నిపిస్తుండ‌గా సుధీర్ బాబు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

‘కపటధారి’ టీజర్ రీలీజ్

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కపటధారి’. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ ను చేసారు చిత్ర యూనిట్. నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు.

 

సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘గతం’ ట్రైలర్ రిలీజ్

కిరణ్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ పొలుదాసు, రాకేష్ గాలెబె , పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాను మొత్తం అమెరికాలోనే మూడు నెలలపాటు షూటింగ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 

‘నాంది’ మూవీ షూటింగ్ పూర్తి

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ “నాంది ” మూవీపై ఆసక్తిని కలిగించాయి. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

నాగశౌర్య – అనీష్ కృష్ణ సినిమా లాంచ్

డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణతో నాగశౌర్య ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా స్క్రిప్ట్ ను నిర్మాత నాగ‌వంశీ చిత్ర‌యూనిట్ సభ్యుల‌కు అంద‌జేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయ‌గా..కొర‌టాల శివ క్లాప్ కొట్టాడు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

ఛార్మీ పేరెంట్స్ కు కరోనా పాజిటివ్

ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతూనే ఉన్నట్టు కనిపిస్తున్నా సినీ సెలబ్రిటీస్ ను.. వారి కుటుంబాలను మాత్రం వదిలేలా కనిపించట్లేదు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది కోలుకున్నా కొంతమంది మాత్రం మృతి చెందారు. ఇక ఇటీవలే తమన్నా పేరెంట్స్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఛార్మీ కౌర్ పేరెంట్స్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ ఐంది. ఇక ఈ విషయాన్ని ఛార్మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసింది.

 

మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’

నేను శైల‌జ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్‌ ఆన్ చేయగా హీరో, హీరోయిన్‌పై ముహూర్తం షాట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్‌ రీల్స్ నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.

‘పెళ్ళి సందD’ హీరో-హీరోయిన్ ఫిక్స్

శ్రీ రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా , రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెళ్ళి సందడి “(1996 ) మూవీ ఘనవిజయం సాధించింది. ఇక ఇప్పుడు మళ్ళీ పెళ్ళిసందడి రానుంది. ఆర్కా మీడియా వర్క్స్ సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై దర్శకేంద్ర రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో “పెళ్ళి సందD” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా ఎంపిక అయ్యారు. హీరోయిన్ గా మాళవిక నాయర్ ను ఎంపిక చేశారు.

‘ఆకాశమే నీ హద్దురా’ ట్రైలర్ రిలీజ్

కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా.. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. అయితే అక్టోబ‌ర్ 30న విడుద‌ల చేయాలని ఫిక్స్ చేసారు కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు. ఇక దసరా సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

 

కార్తీ “సుల్తాన్ “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ హిట్ “రెమో ” మూవీ ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ “మూవీ రూపొందింది. పొన్నాంబళం , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. ఇప్పుడు “సుల్తాన్ “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

‘మిస్ ఇండియా’ ట్రైలర్ రిలీజ్

కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల్లో ‘మిస్ ఇండియా’ సినిమా కూడా ఒకటి. న‌రేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పటీకే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’

సుశాంత్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే హైద‌రాబాద్‌లో మళ్లీ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ సందర్భంగా తన టీంకు థ్యాంక్స్ చెప్పాడు.

‘చావు కబురు చల్లగా’ లావణ్య లుక్ రిలీజ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇటీవలే హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మల్లిక అనే పాత్రలో లావణ్య నటిస్తుంది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =