ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘జాంబిరెడ్డి’. మొదటిసారి ఇలాంటి జోనర్లో సినిమా రావడంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లకూ, మోషన్ పోస్టర్‌కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేసింది. ఆ పనులు కూడా చివరిదశకు వచ్చేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ ను సమంత చేతుల మీదుగా విడుదల చేశారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చేసింది చిత్రయూనిట్. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి బిగ్ బైట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 2న ప్రభాస్ చేతుల మీదుగా బిగ్ బైట్ అంటూ ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేశారు.
#RebelStar #Prabhas garu 🔥🔥🔥 will be unleashing the #ZombieReddy #BigBite on January 2nd, 2021.
Thank you #darling 🤗#RebelStarPrabhas#ZombieReddyTrailer@tejasajja123 @anandhiactress @DakshaOfficial @markkrobin @ursvamsishekar@AppleTreeOffl @HaashtagMedia pic.twitter.com/HXtY75OeCC
— Prasanth Varma (@PrasanthVarma) December 31, 2020
కాగా ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఆపిల్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. మరి సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ’ సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























