‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ డబ్బింగ్ స్టార్ట్

Actor Sushanth Anumolu, Ichata Vahanamulu Niluparadu, Ichata Vahanamulu Niluparadu Movie, Ichata Vahanamulu Niluparadu Movie News, Ichata Vahanamulu Niluparadu Movie Updates, Latest Telugu Movie News, Sushanth Anumolu, Sushanth Begins Dubbing For S Darshan Directorial, Sushanth Upcoming Movie News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలను చేసుకోకుండా వెళ్తున్నాడు సుశాంత్. చివరిగా తను కనిపించిన సినిమా అల వైకుంఠపురములో. అప్పటివరకూ హీరోగా అలరించిన సుశాంత్.. ఈ సినిమాలో మాత్రం ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో నిదానంగా ఉండే పాత్రలో సుశాంత్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు సుశాంత్ S. దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించగా.. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డబ్బింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.

కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సుశాంత్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని అర్ధమవుతుంది. డిసెంబరులో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 10 =