ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 31
గోన గన్నారెడ్డి పాత్రలో బాలకృష్ణ ?
ఇటలీ మీడియా లో ప్రభాస్
'కపటధారి' టీజర్ రీలీజ్
వీక్లీ రౌండప్.. డోంట్ మిస్
ఫెస్టివల్ మూడ్ లో కియారా అద్వానీ
మరో తమిళ మూవీ లో రాశీఖన్నా
'ఆర్ఆర్ఆర్' - భీం టీజర్ కు ముహూర్తం ఫిక్స్
ఆనందంలో పూజాహెగ్డే
రానా కోసం అంటున్న మిహికా
స్వీటెస్ట్ కో స్టార్ కి హ్యాపీ బర్త్ డే
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో యశ్ ?
"దృశ్యం 2" మలయాళ మూవీ షూటింగ్ ప్రారంభం
షూటింగ్స్ తో తాప్సీ బిజీ
'ఓదెల రైల్వేస్టేషన్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్
అశోక్ తేజ దర్శకుడిగా.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మొదటి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్.మొదటి షెడ్యూల్‌లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెరకెక్కించారట.
'సర్కారు వారి పాట' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాకు రెడీ అవుతున్నాడు. అందరూ షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గోన గన్నారెడ్డి పాత్రలో బాలకృష్ణ ?
సాంఘిక , జానపద , పౌరాణిక , చారిత్రాత్మక ఏ జానర్ మూవీలో నైనా తన పాత్రను అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే హీరో బాలకృష్ణ "దానవీర శూర కర్ణ " మూవీ లో అభిమన్యుడు , "బ్రహ్మర్షి విశ్వామిత్ర" లో హరిశ్చంద్రుడు , "ఆదిత్య 369 "లో కృష్ణదేవరాయలు , "భైరవ ద్వీపం "లో రాజ వంశస్థుడు , "శ్రీకృష్ణ విజయం" లో కృష్ణుడు , అర్జునుడు , "శ్రీరామ రాజ్యం "లో శ్రీరాముడు , "గౌతమి పుత్ర శాతకర్ణి "లో శాతకర్ణి గా ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ ఇప్పుడు కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమ దేవి కాలం నాటి వర్ధమానపురం ను పరిపాలించిన గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ రిలీజ్
పలాస 1978 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ కరుణ కుమార్. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇప్పుడు సుధీర్ బాబు.. కరుణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను ఇప్పటికే విడుదల చేయగా తాజాగా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'శ్రీదేవి సోడా సెంటర్' లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. మోషన్ పోస్టర్‌లో సుధీర్ బాబు సోడా పట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకునేలా ఉంది. డెకరేషన్ లైట్స్, సోడా బాటిల్స్, మల్లె పూలు కనిపిస్తుండగా…
ఇటలీ మీడియా లో ప్రభాస్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 "మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దేశ , విదేశాలలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రష్యా , చైనా , జపాన్ వంటి దేశాలలో హీరో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన ప్రభాస్ మూవీస్ కై అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. "రాధేశ్యామ్ "మూవీ తరువాత రెండు భారీ చిత్రాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'కపటధారి' టీజర్ రీలీజ్
సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.
వీక్లీ రౌండప్.. డోంట్ మిస్
గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.
వరద భాదితుల కోసం ముందుకొచ్చిన 'తెలుగు సినీ ప్రముఖులు'
కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచం అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త సాధారణ పరిస్థితులు వస్తున్నాయి కదా అని అనుకునేలోపు మళ్లీ మరో సమస్య వచ్చి పడింది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు. ఏపీలో కాస్త బెటరే కానీ.. భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక ఏ ఆపద వచ్చినా మన సినీ ప్రముఖులు ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నేపథ్యంలో మన సెలబ్రిటీస్ అందరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయగా ఇప్పుడు వరదలతో చిక్కుల్లో పడ్డ హైద్రాబాద్ వాసులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే వారిని ఆదుకునేందుకు…
ఫెస్టివల్ మూడ్ లో కియారా అద్వానీ
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "వినయ విధేయ రామ " మూవీ పరాజయంతో కియారా అద్వానీ మళ్ళీ తెలుగు మూవీస్ లో నటించలేదు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో కియారా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు.
'రాధేశ్యామ్' కు మ్యూజిక్ డైరెక్టర్ గా 'జస్టిన్ ప్రభాకరన్'
బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబల్‌స్టార్" ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్" పేరిట మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరో తమిళ మూవీ లో రాశీఖన్నా
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో తనఅందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాశీఖన్నా మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
'ఆర్ఆర్ఆర్' - భీం టీజర్ కు ముహూర్తం ఫిక్స్
కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాతో తన సత్తా చాటిన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇక ఇన్ని రోజులు కరోనా వల్ల షూటింగ్ కు దూరంగా ఉన్న టీమ్ రీసెంట్ గానే షూట్ ను స్టార్ట్ చేసింది. అంతేకాదు స్టార్ట్ చేస్తూ ఎన్టీఆర్ టీజర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక అప్పటినుండి ఆ తరుణం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
'ముత్తయ్య మురళీధరన్ ' బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి
మొత్తానికి విజయ్ సేతుపతి ముత్తయ్య మురళీధరన్ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.. అంతే కాదు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో విజయ్ సేతుపతిని చూసి అచ్ఛం అలానే ఉన్నాడన్న ప్రశంసలు కూడా దక్కాయి. అయితే మరోపక్క ముత్తయ్య మురళీధరన్ బయోపిక్లో నటించవద్దంటూ నిరసనలు కూడా వెల్లువెత్తుతున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీలంక మతవాదనకు మద్దతు పలికిన మురళీధరన్ నమ్మకద్రోహి అని కాబట్టి అతని బయోపిక్‌లో నటించవద్దంటూ పలు తమిళ సంఘాలు...భారతీరాజాతో సహా పలువురు కోలీవుడ్…
ఆనందంలో పూజాహెగ్డే
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. ఇటలీ లో షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. చిన్న సెట్ లో తక్కువ టీమ్ మెంబర్స్ తో కరోనా వైరస్ జాగ్రత్తలతో షూటింగ్ జరుగుతుందనీ , కెమెరా ముందు మాస్క్ తీయాలి కాబట్టి తప్పకుండా కొంత రిస్క్ ఉంటుందనీ , లైఫ్ కొనసాగించాలంటే కొత్త జీవన శైలి కి అలవాటుపడాలనీ , తొలి రెండు రోజులు భయమనిపించినా ఇప్పుడు అంతా ఓకే ననీ చెప్పారు.
రానా కోసం అంటున్న మిహికా
అసలు పెళ్లి చేసుకుంటాడా అనుకున్న రానా పెళ్లి చేసుకొని మిగిలిన హీరోలకు పెద్ద షాకే ఇచ్చాడు. ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోఫొటో వైరల్ అవుతుంది.
డెస్టినేషన్ వెడ్డింగ్ - పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ
త్వరలోనే మెగా డాటర్ నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది కూడా. ఇక కొద్దిరోజుల్లో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో నిహారిక బ్యాచిలర్ పార్టీ కూడా జరుపుకుంది. ఇక ఈ నేపథ్యంలో తన కూతురి పెళ్లి గురించి.. పనులు గురించి చెపుతూ చెపుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్వీటెస్ట్ కో స్టార్ కి హ్యాపీ బర్త్ డే
వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో యశ్ ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో యశ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసిన "కె జి ఎఫ్ చాప్టర్ 1 " మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించడంతో హీరో యశ్ ఆల్ ఇండియా క్రేజీ హీరోగా మారారు.
"దృశ్యం 2" మలయాళ మూవీ షూటింగ్ ప్రారంభం
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్ , మీనా జంటగా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "దృశ్యం "మలయాళ మూవీ ఘనవిజయం సాధించి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మలయాళ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసి, 150 రోజులకు పైగా ప్రదర్శించబడింది.అనూహ్య పరిస్థితులలో చిక్కుల్లో పడ్డ కుటుంబ సభ్యులను రక్షించుకొనడానికి తపన పడే వ్యక్తి గా మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
షూటింగ్స్ తో తాప్సీ బిజీ
తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ బాలీవుడ్ లో బిజీగా మారారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ , హిందీ భాషల పలు మూవీస్ లో తాప్సీ నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన మూవీ షూటింగ్స్ 6నెలల తరువాత ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.