రీక్యాప్ – ఈవారం టాలీవుడ్ అప్ డేట్స్

Tollywood Recap: Here are the prime tollywood movie updates for this week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆది సాయికుమార్ ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జంగిల్’ అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.‘చీకటిగా ఓ ఇల్లు ఆ ఇంటి నుండి అస్థిపంజ‌రాలు.. దీపం కాంతిలో వాటిని చూస్తూ షాక‌వుతున్న హీరో ఆది, హీరోయిన్ వేదిక‌’.. ఇదే జంగిల్ ఫ‌స్ట్ లుక్‌. కాగా ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’.

‘క‌మిట్‌మెంట్’ టీజ‌ర్ రిలీజ్

హైద‌రాబాద్ న‌వాబ్స్ ఫేం ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో తేజ‌స్వి మ‌డివాడ, అన్వేషి జైన్, ర‌మ్య ప‌సుపిలేటి‌, సూర్య శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం క‌మిట్ మెంట్‌. ల‌వ్, డ్రీమ్,హోప్‌, ఫైట్ అనే నాలుగు భిన్న‌మైన స్టోరీల‌తో ఈ చిత్రం సాగుతుంది. ర‌చ‌న మీడియా వ‌ర్క్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో ఎఫ్3 ప్రొడ‌క్ష‌న్, ఫూట్ లూస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై బ‌ల్‌దేవ్‌సింగ్‌, నీలిమ. టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. న‌లుగురు మ‌హిళ‌ల జీవితంలోకి పురుషులు ఎంట‌రైన త‌ర్వాత వారి జీవితాల‌పై క‌మిట్ మెంట్ ప్ర‌భావం ఎలా ప‌డిందనేది సినిమాలో చూపించ‌నున్న‌ట్టు టీజ‌ర్ ను చూస్తే అర్ధమ‌వుతుంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘ల‌వ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

‘ఇదే మా కథ’ ఫస్ట్ లుక్స్ రిలీజ్

గురుప‌వ‌న్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్‌, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా క‌థ‌. రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ స్టార్ట్ చేసి లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నలుగురు ప్రధాన పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్ట‌ర్లు విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్.

‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ ఫిక్స్

తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం 2021 జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఆగ‌స్ట్ 11,2022న చిత్రాన్ని విడుద‌ల చేయనున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చి ఒక వారం గ్యాప్ తీసుకొని అప్పుడే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టేసారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. డైరెక్టర్ రాధా కృష్ణ సెట్స్ లో ఉన్న ఒక చిన్న స్నిక్ పీక్ వీడియో ను పోస్ట్ చేసాడు.

 

‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్

ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ‌, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ అనే టైటిల్ ను పెట్టారు.ఇక ఈ సినిమా ఈ టైటిల్ పోస్ట‌ర్‌ను హీరో రానా ద‌గ్గుబాటి లాంచ్ చేశారు.

శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో ‘గాలి సంపత్’

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గాలి సంప‌త్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు.

మాస్టర్ ‘టీజర్’ రిలీజ్

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్‌’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

‘మహాసముద్రం’ మూవీ థీమ్ పోస్టర్ రిలీజ్

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టౌనర్ “మహాసముద్రం “మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. “మహాసముద్రం ” మూవీ థీమ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ థీమ్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఓదెల రైల్వేస్టేషన్‌’ – హెబ్బా ఫస్ట్‌లుక్ రిలీజ్

అశోక్ తేజ ద‌ర్శ‌కత్వంలో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఓదెల రైల్వేస్టేషన్‌, ఓదెల పరిసర ప్రాంతాలు, హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెబ్బా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

కీర్తీ సురేష్‌ ‘సాని కాయిదం’ ఫస్ట్ లుక్ రిలీజ్

కీర్తీ సురేష్‌, దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటీనటులుగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘సాని కాయిదం’. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ధనుష్‌ విడుదల చేశారు. కీర్తిసురేష్, సెల్వ రాఘ‌వ‌న్ డీగ్లామ‌రైజ్డ్ లుక్ లో కాస్త భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తున్న స్టిల్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =