దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో బాల నటీనటులతో తెరకెక్కిన “రామాయణం “మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “చూడాలని ఉంది “, “ఒక్కడు “, “రుద్రమదేవి “వంటి సూపర్ హిట్ మూవీస్ తో దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకులను అలరించారు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో “హిరణ్య కశ్యప “మూవీ రుపొందాల్సి ఉండగా , గుణశేఖర్ “శాకుంతలమ్ “మూవీ ని అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో కాళిదాసు రచన ఆదిపర్వంలోని శకుంతల , దుశ్యంత్ ల అద్భుత ప్రేమ కథ “శాకుంతలమ్ “మూవీగా తెరకెక్కనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. “శాకుంతలమ్ “మూవీ బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “శాకుంతలమ్ ” గొప్పదనం గురించి గుణశేఖర్ మాట్లాడుతూ .. కాళిదాసు రచన శకుంతల , దుశ్యంతుల ప్రేమ కథ వెస్ట్రన్ భాషలో అనువాదం అయిన భారతీయ నాటకాలలో మొట్టమొదటిదనీ , 1789 సంవత్సరంలో విలియం జోన్స్ అనువదించారనీ , 1889 సంవత్సరంలో 46 భాషలలో అనువాదంజరుపుకుందని తెలిపారు .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: