“ఆకాశం నీ హద్దురా ” న్యూ మోషన్ పోస్టర్ రిలీజ్

Suriya's Aakaasam Nee Haddhu Ra New Poster Out Now

2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ” సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా ) మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ గోపీనాథ్ ఖరీదైన విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటు లో తీసుకురావడానికి చేసిన కృషి , యదార్థ సంఘటనలతో “ఆకాశం నీ హద్దురా ” మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో మోషన్ పోస్టర్ రిలీజ్ అయి ప్రేక్షకులనుఆకట్టుకుంది. హీరో సూర్య మాట్లాడుతూ .. “ఆకాశం నీ హద్దురా ”
మూవీ తనకు వెరీ స్పెషల్ మూవీ అనీ , తన హృదయానికి దగ్గర అయిందనీ , కలలను సాకారం చేసుకొనడానికి ప్రపంచంలో ఏ శక్తులు ఆపలేవనీ , నిజాయితీగా ప్రయత్నం చేయాలనే మెసేజ్ తో వస్తున్నామనీ , ప్రేక్షకుల ప్రేమ , అభిమానాలకు థ్యాంక్స్ అనీ , ప్రేక్షకులు ఈ మూవీ ని ఆదరించాలని కోరుకుంటున్నా ననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.