తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా అధిక ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య నటించిన ప్రతీ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ” గజిని” , “యముడు” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో సూర్య తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సూర్య ఇప్పుడు “ఆకాశం నీ హద్దురా ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2D ఎంటర్ టైం మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా ఎయిర్ దక్కన్ స్థాపకుడు జి ఆర్ గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా )తమిళ మూవీ దీపావళి కానుకగా ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సూర్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఒక ఉపాధ్యాయుడి కొడుకు గోపినాథ్ ఎయిర్ లైన్ ను స్థాపించడం , ఖరీదైన విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి ఆయన ఎదుర్కొన్న సమస్యలు , గోపినాథ్ సాహసోపేత ప్రయాణం యదార్ధ సంఘటనలతో ఈ మూవీ రూపొందిందనీ , ఈ మూవీ లో నటిస్తున్న సమయంలో తన నిజ జీవిత సంఘటనలు గుర్తుకు వచ్చాయనీ, తన తండ్రి సినిమా నటుడైనా , ఆయనపై ఆధారపడకుండా స్వంత కాళ్ళ పై నిలబడాలని చెప్పేవారని , డిగ్రీ పూర్తి అయిన తరువాత ఒక గార్మెంట్ కంపెనీ లో పని చేశాననీ , స్వంత గుర్తింపు కై పడే కష్టం , ఆనందం ఎలా ఉంటాయో తెలిసిందని , ఈ మూవీ లో నటిస్తున్నప్పుడు ఆ సంఘటనలన్నీ కళ్ళ ముందు కదలాడాయనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: