కాజల్ కు “మోసగాళ్ళు “టీమ్ స్పెషల్ విషెస్

Team Mosagallu Sends Special Wishes To Kajal Aggarwal On Her Wedding

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్ళు ” మూవీ రూపొందుతుంది. సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మోసగాళ్ళు ” మూవీలో కాజల్ అగర్వాల్ , విష్ణు మంచు కు సోదరిగా నటించడం విశేషం. ఈ మూవీ తో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహ సందర్భంగా “మోసగాళ్ళు ” మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలుపుతూ కాజల్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ , మోడరన్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “మోసగాళ్ళు ” మూవీ తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. “మోసగాళ్ళు ” మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + twelve =