ఈవారం టాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్స్

Checkout The Latest Tollywood Updates For This Week,Important Telugu Movie Updates, Important Tollywood News For This Week, Latest Telugu Movie News, Latest Tollywood Film News, Telugu Film News 2020, telugu film updates, Telugu Filmnagar, Telugu Movie Updates This Week, TFN Weekly Recap, TFN Weekly Recap Nov 28-Dec 4, Tollywood Movie Updates, Tollywood Movie Updates This Week, Tollywood Updates This Week, Tollywood Weekly Recap For This Week

ఒరేయ్ బుజ్జిగా – మళ్లీ థియేటర్ రిలీజ్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ ‌ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌ల‌లో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేయనున్నారు.

ఫైనల్ షెడ్యూల్ లో ‘టక్ జగదీష్’

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో నాని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

18 పేజీస్ సెట్ లో అనుపమ పరమేశ్వరన్

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ లో చిన్నగా షూట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె కూడా షూటింగ్ లో అడుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనుపమ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

రెండు చిత్రాలతో వస్తున్న ‘నిశ్శబ్దం’ డైరెక్టర్‌

ఇటీవలే అనుష్క, విలక్షణ నటుడు మాధవన్‌లతో కలిసి ‘నిశ్శబ్దం’ సినిమాను తెరకెక్కించగా.. ఆ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హేమంత్ మధుకర్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఒకటి యాక్షన్‌ రొమాంటిక్‌ చిత్రం కాగా… మరో చిత్రం బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రంగా రూపొందనుందట. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఇవ్వనున్నట్టు సమాచారం.

మహాబలేశ్వర్ లో ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే దాదాపు 50రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మహాబలేశ్వర్ లోని అందమైన లొకేషన్స్ లో ఒక చిన్న షెడ్యూల్ లో షూట్ చేయనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)

నాగ శౌర్య 20 టైటిల్ రిలీజ్

సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ ఇటీవలే చేయగా అందులో నాగశౌర్య లుక్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ‘లక్ష్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ప్రశాంత్ నీల్ – ప్రభాస్ సినిమా ‘సలార్’

ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్‌లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ‘సలార్‌’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ కు కూడా డేట్ ను ఫిక్స్ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అరకులో ‘గాలి సంపత్’ సందడి

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూట్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం అరకులో షూటింగ్ జరుపుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణు తో పాటూ సినిమాలో ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =