RECAP.. ఈ వారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్

Weekly Roundup: Checkout The Tollywood Top Movie Updates For This Week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుడ్‌బై ‘వైల్డ్‌డాగ్’

అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం‌ హిమాలయాస్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు హిమాచ‌ల్ ప్రదేశ్‌లో మ‌నాలీలో షూటింగ్ జరుపుకుంది. అక్కడికి వెళ్ళినప్పుడే నాగ్ దాదాపు మూడు వారాలపాటు షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. “వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది”అని ట్వీట్‌తో పాటు కొన్ని ఫొటోలను నాగార్జున షేర్‌ చేశారు.

 

“వసంత కోకిల ” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తెలుగు , తమిళ వెర్షన్స్ లో రూపొందిన సక్సెస్ ఫుల్ “లవ్ ఫెయిల్యూర్ “మూవీ తో బాబీ సింహా కెరీర్ ప్రారంభించారు. “రన్” , “ఏదైనా జరగొచ్చు” , “డిస్కో రాజా ” మూవీస్ తో బాబీ సింహా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇక ఇదిలా ఉండగా రామ్ తాళ్ళూరి నిర్మాతగా రమణన్ పురుషోత్తమన్ దర్శకత్వంలో బాబీ సింహా హీరోగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో రొమాంటిక్ థ్రిల్లర్ “వసంత కోకిల “మూవీ రూపొందుతుంది. కశ్మీరా పరదేశీ కథానాయిక. రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. బాబీ సింహా బర్త్ డే సందర్భంగా “వసంత కోకిల “మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.

‘నార‌ప్ప’ షూటింగ్ షురూ

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ప్రాంతాల్లో షూటింగ్‌ పునఃప్రారంభించింది చిత్రయూనిట్.

‘గుర్తుందా శీతాకాలం’ – అతిథి పాత్రలో మేఘ

నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ముందు చెప్పినట్టే సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనిలోభాగంగానే నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు మేఘా సుబ్రహ్మణ్యం. ‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేని మేఘ.ఇక ఇప్పుడు ఈ సినిమాలో తెలుగులో మరోసారి నటించే అవకాశం దొరికింది.

నిహారిక పెళ్లి డేట్.. ప్లేస్ ఖరారు..!

మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు తనయుడు చైత‌న్య‌కు ఆగ‌స్ట్ 13న నిశ్చితార్దం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా నిహారిక పెండ్లి ఏ రోజు, ఎక్క‌డ అనే దానిపై క్లారిటీ వ‌చ్చింది. డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుందట. ఒబెరాయ్ గ్రూప్ ఈ ప్యాలెస్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను చూసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇదే ప్యాలెస్ లో టాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ వివాహం కూడా జరిగింది.

రాధేశ్యామ్’ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాధేశ్యామ్. షూటింగ్ కోసం ఇటీవలే ఇటలీలో షూట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటలీలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చిత్ర యూనిట్ ఇండియా చేరుకుంది.

మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్‌గా విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు రాజ్ తరుణ్. రాజ్ త‌రుణ్ తాజాగా త‌న 15వ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించాడు. మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడిగా వర్ష బొల్ల‌మ్మ న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని నంద కుమార్, భ‌ర‌త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. స్వీక‌ర్ అగ‌స్తి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షూటింగ్ ను త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

హిమజ ప్ర‌ధాన పాత్ర‌లో ‘జ’

బుల్లి తెర.. వెండితెర ప్రేక్షకులకు హిమజ సుపరిచితురాలే. ప‌లు సీరియ‌ల్స్ , సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేసిన హిమ‌జ తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకుంది. ఇక గత ఏడాది బిగ్ బాస్ సీజ‌న్ 3లో ఒక కంటెస్టెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హిమజ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు `జ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ లుక్ సినిమాపై ఆస‌క్తిని రేపుతుంది.

 

‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో అడుగుపెట్టిన లేడీ స్కాట్‌

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. తాజాగా ఐరీష్‌ నటి ఆలిసన్ డూడీ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చారు.. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =