
ట్యాగ్ · 101 కథనాలు · పేజీ 5


గ్రీస్ దేశంలో "కార్తికేయ 2" షూటింగ్

మెగా అల్లుడి మరో కొత్తసినిమా

"క్లాప్" మూవీ టీజర్ రిలీజ్ డేట్

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మూవీ "SSC" -మహేష్ బాబు

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు

శిల్పారామం లో "RRR"హీరోయిన్ ఒలీవియా మోరీస్

"బంగార్రాజు "ఫస్ట్ లుక్ రిలీజ్

లాక్ డౌన్ కాన్సెప్ట్ తో విశ్వక్ సేన్ మూవీ

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్

కళ్యాణ్ దేవ్ "కిన్నెరసాని"టీజర్ రిలీజ్

"రొమాంటిక్ " మూవీ సెన్సార్ పూర్తి
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , కేతిక శర్మ జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "రొమాంటిక్ " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించగా మందిరా బేడి , మకరంద్ దేశ్ పాండే , దివ్య దర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించడం విశేషం.

గ్రీస్ దేశంలో "కార్తికేయ 2" షూటింగ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ కి “దైవం మనుష్య రూపేణా ” టైటిల్ ను దర్శక , నిర్మాతలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ లో స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

మెగా అల్లుడి మరో కొత్తసినిమా
టాలీవుడ్ లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ మరీ మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ లిస్ట్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఉన్నాయి. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన 'సూపర్ మచ్చి' సినిమా రిలీజ్ అవ్వాలి. అశ్వద్ధామ ఫేమ్ రమణ తేజ కాంబినేషన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

"క్లాప్" మూవీ టీజర్ రిలీజ్ డేట్
బిగ్ ప్రింట్ పిక్చర్స్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ బ్యానర్స్ పై పృథ్వీ ఆదిత్య దర్శకత్వం లో ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ది సౌండ్ ఆఫ్ సక్సెస్ క్యాప్షన్ తో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన ''క్లాప్" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆకాంక్ష సింగ్ కథానాయిక కాగా కృష్ణ కురూప్ , ప్రకాష్ రాజ్, నాజర్ , బ్రహ్మాజీ , రాందాసు ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

'పాగల్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
నరేష్ కొప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా పాగల్. ఇటీవలే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకొని కలెక్షన్స్ కూాడా బాగానే రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా అలా థియేటర్లలో రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఈ నెల 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లకు వెళ్లిసినిమా చూడాలని భయపడిన ఇక ఇంట్లోనే ఈసినిమా చూడొచ్చు.

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్
టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని తన సినిమాలతో తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. అయితే బిచ్చగాడు తరువాత పలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా వస్తున్న సినిమా విజయ రాఘవన్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ చిత్రయూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 17న ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మూవీ "SSC" -మహేష్ బాబు
70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “పలాస 1978 “మూవీ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “శ్రీదేవి సోడా సెంటర్ ” మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్ “టీమ్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు
సక్సెస్ ఫుల్ "పలాస 1978 " మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు విడుదలకు ముందు నుండి విడుదల అయిన తర్వాత కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శిల్పారామం లో "RRR"హీరోయిన్ ఒలీవియా మోరీస్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

"ది ఘోస్ట్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్‌లో కనిపించనున్నారు.

విశాల్ 31 ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్
వైవిద్యభరితమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. తమిళ్ లోనే కాదు తన సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విశాల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శరవణన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలజ్ చేశారు చిత్రయూనిట్. విశాల్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ ఫస్ట్ లుక్ అందరినీ…

"బంగార్రాజు "ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ "బంగార్రాజు " మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , ఒక కీలక పాత్రలో నటిస్తున్న హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నారు. “బంగార్రాజు “మూవీలో మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవలే పవర్ ప్లే తో కాస్త ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంద. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వెనుక గుడి గోపురం.. ఒక పక్క డబ్బు.. మరో పక్క హీరో చేతిలో కోడితో ఉన్న ఈ పోస్టర్…

'శ్రీదేవి సోడా సెంటర్' పై కె.జి.యఫ్ డైరెక్టర్ స్పందన
కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా మంచి పాజిటివ్ టాకే నే సొంతం చేసుకుంది. సక్సెస్ ఫుల్ పలాస 1978 మూవీ తరువాత మరో అద్భుతమైన మూవీ శ్రీదేవి సోడా సెంటర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారని.. సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉందని అంటూ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై ఎంతోమంది ప్రశంసలు కురిపించగా ఇప్పుడు కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా స్పందించాడు. నా ఫ్రెండ్ ఈ చిత్ర నిర్మాత విజయ్ చిల్లా తో సినిమా కోసం గొప్ప విషయాలు వింటున్నానని.. దర్శకుడు కరుణ కుమార్ కి అలాగే…

లాక్ డౌన్ కాన్సెప్ట్ తో విశ్వక్ సేన్ మూవీ
"పాగల్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్ కొత్త మూవీ షూటింగ్ ఆగస్ట్ 16 వ తేదీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. బివిఎస్ ఎన్ ప్రాసాద్ సమర్పణలో ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా"అశోకవనంలో అర్జున కళ్యాణం" మూవీ తెరకెక్కుతుంది. టైటిల్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో విశ్వక్ సేన్ ఇప్పటి వరకూ యూత్ , మాస్ ఆడియన్స్ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వక్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించనున్నారు.

'విశాల్ 31' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
శరవణన్ దర్శకత్వంలో విశాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘విశాల్ 31’ అనే వర్కింగ్ టైటిల్‌తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమా సెట్లోనే విశాల్ కు గాయమైంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని మేకర్స్ తాజాగా ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు “విశాల్ 31” ఫస్ట్ లుక్, టైటిల్ ను వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్‌లో అనౌన్స్ చేస్తూ విశాల్ పోస్టర్‌ని…

'మాస్ట్రో' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో మాస్ట్రో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదూన్ సినిమాకు ఈసినిమా రీమేక్. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన ఈసినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇప్పటికే టైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.

కళ్యాణ్ దేవ్ "కిన్నెరసాని"టీజర్ రిలీజ్
సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ , శుభమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై "అశ్వథ్థామ మూవీ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో, అతి సర్వత్ర వర్జయేత్ క్యాప్షన్ తో "కిన్నెరసాని" మూవీ తెరకెక్కుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లిమ్స్ , 'థీమ్ ఆఫ్ కిన్నెరసాని' సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

"శ్రీదేవి సోడా సెంటర్ "టీమ్ కు మహేష్ బాబు అభినందనలు
70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "పలాస 1978 "మూవీ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. పావెల్ నాగీతన్ , నరేష్ , రఘు బాబు , అజయ్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో సుధీర్ బాబు , ఆనంది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.