వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున , కాజల్ రా ఏజెంట్స్ గా నటిస్తున్నారు. హీరో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ రోల్‌లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక షూటింగ్ షెడ్యూల్ గోవా లో కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. హీరో నాగార్జున బర్త్ డే సందర్భంగా “ది ఘోస్ట్” అనే టైటిల్‌తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగార్జున నల్లటి కోటు ధరించి చేతిలో కరవాలంతో శక్తివంతంగా కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “ది ఘోస్ట్” మూవీ తో పాటు నాగార్జున “బంగార్రాజు “మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: