టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవలే పవర్ ప్లే తో కాస్త ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు “మూవీ ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంద. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వెనుక గుడి గోపురం.. ఒక పక్క డబ్బు.. మరో పక్క హీరో చేతిలో కోడితో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అన్నపూర్ణ స్టూడియస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to show you the first Look of our next !! @itsRajTarun#AnubhavinchuRaja @AnnapurnaStdios @SVCLLP @itsRajTarun @GavireddySreenu @adityamusic pic.twitter.com/RVOgI4aBRq
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 28, 2021
దీంతోపాటు మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ‘స్టాండప్ రాహుల్’ లో చేస్తున్నాడు. ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: