
ట్యాగ్ · 101 కథనాలు · పేజీ 4


అక్టోబర్ లో సెట్స్ పైకి 'చంద్రముఖి2'

25 సంవత్సరాల తరువాత "ప్రేమదేశం" సీక్వెల్

"డేగల బాబ్జీ" ఫస్ట్ లుక్ రిలీజ్

"సీటీమార్" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

ఆనందం లో సీనియర్ హీరోయిన్ భూమిక

మళ్లీ 'ఆచార్య' సెట్ లో చిరు, చరణ్

'హనుమాన్' ప్రీ లుక్ రిలీజ్

అఫీషియల్.. 'సీత' గా కంగనా

"రీసౌండ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

'స్వాతిముత్యం' గా గణేష్ బెల్లంకొండ

ఇకపై రీమేక్ సినిమాలు చేయను

బిందు మాధవి కొత్త సినిమా ప్రారంభం

షూటింగ్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'

బాలయ్య అంటే ఓ సింహం - పూర్ణ

"సీటీమార్" పై ప్రభాస్ ప్రశంసలు

ఫైనల్ స్టేజ్ లో 'విరాట పర్వం'

'సీటీమార్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'

'నాయట్టు' తెలుగు రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..!
మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చాాలా సినిమాలు రీమేక్ అయి రిలీజ్ అవ్వగా.. కొన్ని రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగామలయాళంలో ఈ ఏడాది వచ్చిన నయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే..

అక్టోబర్ లో సెట్స్ పైకి 'చంద్రముఖి2'
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులైపోయింది.

విశాల్ 'ఎనిమి' డబ్బింగ్.. ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక తాజాగా విశాల్ ఈసినిమా తెలుగు డబ్బింగ్ చెబుతున్నవీడియో ఒకటి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తున్నట్టు ఉంది అంటూ తన మీద తానే కామెంట్ వేసుకున్నాడు.

25 సంవత్సరాల తరువాత "ప్రేమదేశం" సీక్వెల్
జెంటిల్‌మెన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కదిర్ దర్శకత్వంలో వినీత్, అబ్బాస్, టబు ప్రధానపాత్రలలో నటించిన "కాదల్ దేశం " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ప్రేమ దేశం " మూవీ 1996 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. 25 సంవత్సరాల తరువాత "ప్రేమదేశం" సీక్వెల్ తెరకెక్కనుంది.

"డేగల బాబ్జీ" ఫస్ట్ లుక్ రిలీజ్
"వినోదం "మూవీ తో కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , రవితేజ వంటి స్టార్ హీరోస్ తో మూవీస్ నిర్మించారు. బండ్ల గణేష్ ఇప్పుడు హీరో గా ప్రేక్షకులను అలరించనున్నారు.

"సీటీమార్" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో గోపీచంద్, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగంగన మరో కథానాయిక. హీరో గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన “సీటీ మార్ ” మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.

ఆనందం లో సీనియర్ హీరోయిన్ భూమిక
"యువకుడు "(2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ఆకట్టుకున్నారు. భూమిక కథానాయికగా రూపొందిన "ఖుషి" మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , "మిస్సమ్మ " మూవీ కి నంది అవార్డ్ , "సత్యభామ "మూవీ కి నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. "మిడిల్ క్లాస్ అబ్బాయి" భూమిక మూవీ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. భూమిక ప్రస్తుతం ఒక తెలుగు , ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు.

మళ్లీ 'ఆచార్య' సెట్ లో చిరు, చరణ్
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తవ్వగా ఇంకా రెండు పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈగ్యాప్ లో మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ కూడా పూర్తి కావడంతో శంకర్‌తో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశారు.

'హనుమాన్' ప్రీ లుక్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. ఇప్పటివరకూ తాను దర్శకత్వం వహించిన సినిమాలను బట్టి ఆవిషయం చెప్పొచ్చు.ఇక జాంబిరెడ్డి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసారి మరో కొత్త జోనర్ తో వచ్చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాదు‘అంజనాద్రి నుంచి తమ హనుమంతు ని కలుసుకోవచ్చని’ ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 18న ఉదయం 10గంటల 8 నిమిషాలకు…

అఫీషియల్.. 'సీత' గా కంగనా
బాలీవుడ్ క్వీన్, మణికర్ణిక, తలైవి ఇప్పటికే అర్ధమయిఉంటుంది కదా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఇంకెవరూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించే. ఇటీవలే తలైవితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా ఇప్పుడు సీత అవతారం ఎత్తనుంది. గత కొంతకాలంగా కంగనా సీత పాత్రలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. కానీ ఈ విషయంలో ఇంతవరకూ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

"రీసౌండ్" మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
లాంగ్ గ్యాప్ తరువాత సాయి రామ్ శంకర్ ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ అమృత వర్షిణి క్రియేషన్స్ , శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ , రియల్ రీల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్ ఎస్ మురళీకృష్ణ దర్శకత్వంలో సాయి రామ్ శంకర్ హీరోగా ఒక మూవీ తెరకెక్కుతుంది. రాశీ సింగ్ కథానాయిక కాగా అరవింద్ కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు.

'స్వాతిముత్యం' గా గణేష్ బెల్లంకొండ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి గణేష్ బెల్లంకొండ ఎప్పుడో అరంగేట్రం చేయాలి కానీ అనుకోని పరిస్థితుల్లో మొదటి సినిమా ఆగిపోయింది. ఇక వెంటనే ఎలాంటి నిరాశ చెందకుండా రెండో సినిమాను లైన్ లో పెట్టేసి ఇప్పుడు దాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు గణేష్ బెల్లంకొండ. లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకత్వంలో గణేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. త్వరలోనే షూట్ పూర్తి కానుంది.

ఇకపై రీమేక్ సినిమాలు చేయను
ఇకపై రీమేక్ సినిమాలు చేయను.. ఈ మాట ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ చెప్పగా విన్నాం. ఇక ఇప్పుడు ఈలిస్ట్ లోకి మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హిందీలో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమాను తెలుగులో మాస్ట్రో గా రీమేక్ చేసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ. నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 17న ఈసినిమా డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

బిందు మాధవి కొత్త సినిమా ప్రారంభం
"ఆవకాయ్ బిర్యానీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బిందు మాధవి , "పొక్కిషం"మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు."బంపర్ ఆఫర్ ", "పిల్ల జమీందార్ " (2011 ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన బిందుమాధవి కోలీవుడ్ లో బిజీగా మారారు. 10 సంవత్సరాల తరువాత బిందు మాధవి ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

షూటింగ్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'
డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ కథలను చేయడానికి యంగ్ హీరో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. ఈసినిమా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగేలా చేశాడు శ్రీవిష్ణు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా…

బాలయ్య అంటే ఓ సింహం - పూర్ణ
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.

"సీటీమార్" పై ప్రభాస్ ప్రశంసలు
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో గోపీచంద్, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగాంగన మరో కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు.

ఫైనల్ స్టేజ్ లో 'విరాట పర్వం'
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా గురించి కూడా ఈమధ్య ఎలాంటి వార్తలు లేవు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కరోనా వల్ల చాలా సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడినా ఆ తరువాత కాస్త పరిస్థితులు నార్మల్ కు రాగానే అందరూ షూటింగ్ లు పూర్తి చేసుకున్నారు.. రిలీజ్ లు కూడా చేస్తున్నారు. కానీ విరాట పర్వం మాత్రం ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలోనే ఉంది. నిజానికి కరోనా ముందే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా.

'సీటీమార్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమాను చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

దసరా కు రిలీజ్ కానున్న 'ఎనిమి'
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం అందరూ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు. డేట్అయితే చెప్పలేదు కానీ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.