పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ కి “దైవం మనుష్య రూపేణా ” టైటిల్ ను దర్శక , నిర్మాతలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ లో స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న “కార్తికేయ 2” మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. గ్రీస్ దేశంలో పలు లొకేషన్స్ లో 10రోజుల షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ గ్రీస్ దేశానికి త్వరలో ప్రయాణం కానుంది. సెప్టెంబర్ నెలాఖరుకి “కార్తికేయ 2” మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. నిఖిల్ హీరోగా రూపొందిన “18 పేజెస్ “మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. నిఖిల్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: