70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “పలాస 1978 “మూవీ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “శ్రీదేవి సోడా సెంటర్ ” మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. పావెల్ నాగీతన్ , నరేష్ , రఘు బాబు , అజయ్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో సుధీర్ బాబు , ఆనంది అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ మహేష్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్ “టీమ్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. సక్సెస్ ఫుల్ “పలాస 1978 “మూవీ తరువాత మరో అద్భుతమైన మూవీ “శ్రీదేవి సోడా సెంటర్ ” తో ప్రేక్షకుల ముందుకు వచ్చారనీ , సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనీ , బ్రిలియంట్ విజువల్స్ , అవుట్ స్టాండింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటూ మహేష్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్ “మూవీ టీమ్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: