శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , ఒక కీలక పాత్రలో నటిస్తున్న హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్ సంగీతం అందిస్తున్నారు. “బంగార్రాజు “మూవీలో మోనాల్ గజ్జర్ ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కింగ్ నాగార్జున బర్త్ డే కు ఆయన తనయుడు నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ “బంగార్రాజు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో నాగార్జున ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున , ఎప్పుడూ ఆరోగ్యంగా , సంతోషంగా ఉండాలనీ , మీతో స్క్రీన్ షేర్ చేసుకొనడానికి ఎదురు చూస్తున్నాననీ నాగచైతన్య ట్వీట్ చేశారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: