పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ అందించారు. “గబ్బర్ సింగ్ ” మూవీ మళ్ళీ రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబరు 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో “గబ్బర్ సింగ్”మూవీని 100 షోలతో మళ్లీ విడుదల చేయాలనుకుంటున్నాననీ , ఈసారి థియేటర్లలో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల్ని చేసుకుందామనీ , థియేటర్ల అనుమతి గురించి తాను చూసుకుంటాననీ , మీరు టికెట్ బుక్ చేసుకోండనీ . “గబ్బర్ సింగ్”మూవీ ని ఇంకోసారి వీక్షించి, పండగ చేసుకుందామనీ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: