మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చాాలా సినిమాలు రీమేక్ అయి రిలీజ్ అవ్వగా.. కొన్ని రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగామలయాళంలో ఈ ఏడాది వచ్చిన నయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వగా ఇక ఈసినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్న సంగతి కూడా విదితమే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో అంజలి, రావు రమేష్ ఇంకా సత్యదేవ్ నటించే అవకాశాలు ఉన్నట్టు టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. పలాస ఫేమ్ కరుణ కుమార్ కు ఈసినిమా రీమేక్ ను రూపొందించే అవకాశం దక్కింది అంటున్నారు. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నవంబర్ నుండి ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాకు ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘బ్రాకెట్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘బ్రాకెట్’ అంటే జూదానికి సంబంధించిన ఒక ఆట. ఇక తెలుగులో గ్యాంబ్లర్ల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ టైటిల్ అయిటే కరెక్ట్ గా ఉంటుందని ఆలోచిస్తున్నారట. మరి వీటిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా మార్టిన్ ప్రకట్ దర్శకత్వంలో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిష సాజయన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ పోందింది. మరి తెలుగులో ఈసినిమా ఎంత వరకూ విజయం దక్కించుకుంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: