వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా గురించి కూడా ఈమధ్య ఎలాంటి వార్తలు లేవు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కరోనా వల్ల చాలా సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడినా ఆ తరువాత కాస్త పరిస్థితులు నార్మల్ కు రాగానే అందరూ షూటింగ్ లు పూర్తి చేసుకున్నారు.. రిలీజ్ లు కూడా చేస్తున్నారు. కానీ విరాట పర్వం మాత్రం ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలోనే ఉంది. నిజానికి కరోనా ముందే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. ఈసినిమా చివరి షెడ్యూలు షూటింగ్ గత కొన్ని రోజులుగా హైద్రాబాద్ లో జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా పూర్తిచేసి ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా యదార్ధ సంఘటనల ఆధారంగా 1990 కాలంనాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: