ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , జగపతిబాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “అఖండ” సినిమాలో బాలయ్యతో కలిసి నటించిన హీరోయిన్ పూర్ణ. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక మీడియాతో ముచ్చటించారు. “అఖండ “మూవీ లో తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనీ , హీరో బాలకృష్ణ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి పూర్ణ మాట్లాడుతూ .. సెట్స్‌పై మొదటిసారి బాలయ్యను కలిసిన సమయంలో ఆయన రిసీవ్ చేసుకున్న విధానానికి ఫిదా అయ్యాననీ , బాలయ్య అంటే ఓ సింహం అని కామెంట్ చేస్తూ , షూటింగ్ సమయంలో తోటివారిని ఎంతో గౌరవిస్తూ చాలా సాదాసీదాగా ఉంటారనీ , ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే బాలయ్య ఫొటో చూస్తాననీ , ఎందుకంటే ఆ సింహం లాగే ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా రోజంతా పని చేయాలి కాబట్టనీ , బాలయ్య లాంటి గ్రేట్ యాక్టర్‌తో మరిన్ని సినిమాలు చేసి మరింత స్ఫూర్తి పొందాలని ఉందినీ పూర్ణ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: