సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమాను చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపిచంద్..
గోపీచంద్ సినిమా కాబట్టి ఆటోమేటిక్ గానే ఈసినిమాపై ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో మొదటి సారి ప్రయత్నిస్తున్నాడు ఈ మ్యాచో హీరో. అందులోనూ కబడ్డీ కోచ్ గా నటిస్తుండటంతో.. దానికతోడు గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈసినిమా వస్తుండటంతో మరింత ఆసక్తి పెరిగింది.
తమన్నా..
ఇక తమన్నా కూడా మొదటి సారి ఇలాంటి పాత్రలో నటిస్తుంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకే పరిమితమైన తమన్నా ఇప్పుడు తన రూట్ మార్చి పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంది. అందులో ఈ సీటీమార్ సినిమా కూడా ఒకటి. ఇందులో తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా చేస్తుంది. తమన్నా క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది.
కథ..
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ రూపొందించారు. కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూాడా మెండుగా ఉండేలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఖచ్చితంగా ఈసినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
డైరెక్టర్..
సంపత్ నంది సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించడంలో సంపత్ నంది దిట్ట. ఈసినిమాలో కూడా తన మార్క్ కనిపిస్తుంది. అటు స్పోర్ట్ప్ ప్రాధాన్యత చెబుతూనే మరోవైపు కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా అస్సలు మిస్సవ్వలేదని ఇప్పటికే టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: