ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా ఎనిమి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ప్రస్తుతం అందరూ సినిమాలు రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రిలీజ్ ఎప్పుడో ప్రకటించారు. డేట్అయితే చెప్పలేదు కానీ దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Enemy WORLDWIDE Grand Release on #Dussehra pic.twitter.com/hYxvPzMXNh
— Vishal (@VishalKOfficial) September 6, 2021
కాగా ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. ఈసినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























