ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోస్ గా వస్తున్న సినిమా ఎనిమి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇక తాజాగా విశాల్ ఈసినిమా తెలుగు డబ్బింగ్ చెబుతున్నవీడియో ఒకటి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అంతేకాదు తెలుగులో డబ్బింగ్ చెబుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా చేస్తున్నట్టు ఉంది అంటూ తన మీద తానే కామెంట్ వేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The secret behind my way of dubbing in telugu has been revealed.
Like a #TrafficConstable at his best. #EnemyDubbing#Enemy at final stage of Post-Production. pic.twitter.com/k8t7KGdKCK— Vishal (@VishalKOfficial) September 21, 2021
కాగా ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి వాడు వీడు సినిమాలో కలిసి నటించిన విశాల్ ఆర్య ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాలో కనిపించబోతోన్నారు. ఈసినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: