వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుల్లో ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. ఇప్పటివరకూ తాను దర్శకత్వం వహించిన సినిమాలను బట్టి ఆవిషయం చెప్పొచ్చు.ఇక జాంబిరెడ్డి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ, తేజ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసారి మరో కొత్త జోనర్ తో వచ్చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాదు‘అంజనాద్రి నుంచి తమ హనుమంతు ని కలుసుకోవచ్చని’ ఫస్ట్ లుక్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 18న ఉదయం 10గంటల 8 నిమిషాలకు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Dive into the world of Anjanadri!🏔Introducing #Hanumanthu from 𝐇𝐀𝐍𝐔🔶𝐌𝐀𝐍
⏰18th September, Saturday @ 10.08AM
A @PrasanthVarma Film!🎬@tejasajja123@niran_reddy @Primeshowtweets @chaitanyaniran @asrinreddy @ursvamsishekar#HanuMan #HanuManTheOrigin #SuperHeroHanuMan pic.twitter.com/jeAiHOlXd4
— Prasanth Varma (@PrasanthVarma) September 16, 2021
కాగా ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక`హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగు పాటు ఈసినిమాను పలు భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి ప్రేక్షకులను బాగా అలరించింది. మొదటి సారి జాంబీస్ ను తెలుగులో చూపించాడు. ఇప్పుడు సూపర్ హీరోస్ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: