
ట్యాగ్ · 101 కథనాలు · పేజీ 3


ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్

'ప్రభాస్ 25' క్రేజీ అప్ డేట్

'ప్రభాస్ 25' అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్

కిస్మస్ బరిలో 'ఆచార్య'..!

టాలీవుడ్ లో దసరా సందడి

'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్

గాంధీ జయంతి రోజున 'ఇదే మా కథ' రిలీజ్

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ

'వరుడు కావలెను' రిలీజ్ డేట్ ఫిక్స్

వెబ్ సిరీస్ లపై మహేష్ బాబు కామెంట్స్

ఇంగ్లీష్ సినిమాలు చేయాలని సితారకి ఇంట్రెస్ట్

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్

'రాకెట్రీ' రిలీజ్ పై మాధవన్ క్లారిటీ

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?

"వరుడు కావలెను"న్యూ రిలీజ్ డేట్
సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య , రీతూవర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ”వరుడు కావలెను “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో మురళీశర్మ , నదియా , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'సీటీమార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సీటీమార్. ఇక ఈసినిమా కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని రిలీజ్ అయింది. మాస్ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈసినిమా మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకొని చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నగోపిచంద్ కు విజయాన్ని అందించింది. ఇక ఈసినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 15 నుంచి సీటీమార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్టు K " మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. హీరో ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ అనౌన్స్ మెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే.

అఫీషియల్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో 'ప్రభాస్ 25'
ఒకప్పుడు అంటే హీరోలు ఏడాదికే వరసుపెట్టి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి చేసే సినిమాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే సిల్వర్ జూబ్లీ సినిమా అంటే 25వ సినిమానే ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ 25వ సినిమా గురించి అప్ డేట్ వస్తుందని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆ అప్ డేట్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా తాజాగా ప్రభాస్ 25వ సినిమా అప్ డేట్ వచ్చేసింది.

'ప్రభాస్ 25' క్రేజీ అప్ డేట్
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. తన ప్రస్తుతం చేస్తున్న సినిమాలు.. అలానే ఫ్యూచర్ లో చేయబోయే సినిమాలు కూడా అన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే. ఇక ప్రభాస్ సినిమాలంటే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకు వస్తున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉండగా ఇప్పుడు ప్రభాస్ 25వ సినిమా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ 24వ సినిమా ఎవరితో ఉంటుంది.. ఆసినిమా అప్ డేట్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ 25వ సినిమా గురించి మాత్రం ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం 25వ సినిమా అప్ డేట్ రావడమే. ఇక తాజాగా…

'ప్రభాస్ 25' అనౌన్స్ మెంట్ డేట్ ఫిక్స్
మొత్తానికి ప్రభాస్ ఈసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావడానికి సిద్దమయ్యాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆ తరువాత అన్నీ పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ లిస్ట్ లో నాలుగు భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఉన్నాాయి. అందులో రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇంకా ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ ఇంకా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ దశలోనే ఉన్నాయి.

కిస్మస్ బరిలో 'ఆచార్య'..!
పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ల విషయంలో ఇప్పటికే చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఏదో ఒకటి రెండు సినిమాల విషయంలో కాస్త ఇంకా క్లారిటీ రావాల్సి ఉండగా.. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ డేట్లను సైతం ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇంకా రిలీజ్ విషయంలో క్లారిటీ రాని సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడకుండా ఉంటే ఆగష్ట్ లో ఈసినిమా రిలీజ్ అయి ఉండేది. అయితే అది కుదరలేదు. దీంతో దసరాకు అయినా ఈసినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో దసరా కు కూడా ఈసినిమా రిలీజ్ కాలేకపోతుంది. ఇక ఫైనల్ గా సంక్రాంతికే ఈసినిమాను…

టాలీవుడ్ లో దసరా సందడి
దసరా , దీపావళి , సంక్రాంతి సీజన్స్ లో పలు మూవీస్ విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తాయనే విషయం తెలిసిందే. ఈ సంవత్సరం దసరా పండగ కు పలు మూవీస్ రిలీజ్ కానున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన "లవ్ స్టోరి" మూవీ ఘనవిజయం సాధించడంతో మేకర్స్ తమ మూవీస్ ను దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దసరా సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకొందాం.

'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమా లక్ష్య కూడా ఒకటి. రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే విడుదలై ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లోకూడా ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. సినిమాకు మంచి బజ్ రావాలంటే ఈమధ్య ప్రమోషన్ కార్యక్రమాల్లో కొత్త దనం చూపిస్తున్నారు మేకర్స్. ఇక లక్ష్య టీం ప్రతి శుక్రవారం ఒక అప్ డేట్ ఉంటుందని ఆ మధ్య ప్రతి శుక్రవాం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి…

గాంధీ జయంతి రోజున 'ఇదే మా కథ' రిలీజ్
గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను ఇటీవలే విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా.. ఆ టీజర్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు కూడా సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల రిలీజ్ కు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని గాంధీ…

మరోసారి 'కె.జి.యఫ్ 2' పై క్లారిటీ.. అనుకున్న డేట్ కే రిలీజ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఇక ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక అన్ని సినిమాలకు ఉన్నట్టే.. ఈ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది.. కానీ కరోనా కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు.

మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ
ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

దీపావళి రేస్ లో 'రొమాంటిక్' మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

'వరుడు కావలెను' రిలీజ్ డేట్ ఫిక్స్
నాగశౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా వరుడు కావలెను. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని ఇప్పటికే చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చినా డేట్ మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దసరాకు ఇప్పటికే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతుండగా ఇప్పుడు నాగశౌర్య కూడా దసరాకే…

వెబ్ సిరీస్ లపై మహేష్ బాబు కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇంగ్లీష్ సినిమాలు చేయాలని సితారకి ఇంట్రెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. చిన్న వయసులోనే ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ వయసులో యూ ట్యూబ్ ఛానల్ ను మెయింటైన్ చేస్తుందంటేనే చెప్పొచ్చు ఎంత టాలెంటెడో. ఇక సితార కు సంబంధించిన ఫొటోలు కానీ వీడియోలు కానీ మహేష్, నమ్రత సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇక సితారకు సంబంధించిన వీడియో ఏదైన బయటకు వచ్చిందంటే అది నిమిషాల్లో వైరల్ అవుతుంది.

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి. ఇప్పిటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇక ఇదిలాఉండగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల షూటింగ్ మిగిలిఉందని తెలిపారు. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు.

'రాకెట్రీ' రిలీజ్ పై మాధవన్ క్లారిటీ
తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఇక ఇటీవలే తెలుగులో విలన్ పాత్రలు కూడా పోషించాడు. ఇక ఇదిలా ఉండగా మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా రాకెట్రీ సినిమాను మాధవన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఎంతో ఇంట్రెస్ట్ తో ఈసినిమాను రూపొందించాడు మాధవన్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ట్రైలర్ కూడా ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ సినిమా రిలీజ్ మాత్రం ఇంతవరకూ అవ్వలేదు. ప్రస్తుతం 50 శాతం ఆక్యూపెన్నీతో కాస్త థియేటర్లు తెరుచుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాదాపు పెండింగ్ లో ఉన్న అన్ని సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్…

ఓటీటీలో 'రాజ రాజ చోర'.. రిలీజ్ డేట్ ఫిక్స్
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. ఇక ఈసినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగష్ట్ 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌కానునట్టు జీ5 సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం "గాడ్ ఫాదర్"మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్", బాబీ దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తమిళ సూపర్ హిట్ “వేదాళం" మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్” మూవీ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు గా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.