
ట్యాగ్ · 290 కథనాలు · పేజీ 8


'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్

హిందీ భాషలో భారీగా "ఆచార్య "రిలీజ్

"వాలిమై"తమిళ మూవీ లో అజిత్ తో కార్తికేయ

నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం

దసరాకు "#NANI 29 " మూవీ అనౌన్స్ మెంట్

దసరాకు 'నాని 29' అనౌన్స్ మెంట్

గ్రాండ్ గా పూజాహెగ్డే బర్త్ డే

సర్ ప్రైజ్ తో రానున్న 'శ్యామ్ సింగరాయ్'

'ఆచార్య' పూజా లుక్ రిలీజ్

బాలీవుడ్ లో ప్రభాస్ దూకుడు

"ఆచార్య" మూవీ రిలీజ్ డేట్

'సత్యాగ్రహి' అందుకే చేయలేదు..!

'ఆది పురుష్' కోసం విదేశీ నిపుణులు

'బిగ్ బ్రదర్' కు 'చిరు' బర్త్ డే విషెస్

టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ రష్మిక

'సలార్' మూడో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్న ప్రభాస్

రెజీనా ట్విట్టర్ రికార్డ్

బుడాఫెస్ట్ లో "ఏజెంట్"

'భోళా శంకర్' లాంగ్ షెడ్యూల్ కు ప్లాన్..!
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ మీదున్నాడు. వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇందులో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇందులో గాడ్ ఫాదర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా… భోళా శంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

'శ్యామ్ సింగరాయ్' రిలీజ్ డేట్ ఫిక్స్
నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే కరోనా సమయంలో నాని రెండు సినిమాలు రిలీజ్ చేసినా అవి రెండూ ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఇక ఈసారి మాత్రం థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం నాని రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో శ్యామ్ సింగరాయ్ ఒకటి. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ భారీగా ఉంటాయని ఇప్పటికే చెప్పారు. దీనికోసం ఎక్కువ సమయం పట్టనుంది.

దీపావళికి పూర్ణ "బ్యాక్ డోర్ "మూవీ రిలీజ్
సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో ఆర్చిడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కర్రి బాలాజీ దర్శకత్వం లో పూర్ణ ప్రధాన పాత్రలో , తేజ త్రిపురాన హీరోగా రూపొందిన "బ్యాక్ డోర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రణవ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవిశంకర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "బ్యాక్ డోర్ "మూవీ దీపావళి కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం.

హిందీ భాషలో భారీగా "ఆచార్య "రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఫిబ్రవరి 4, 2022న రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"వాలిమై"తమిళ మూవీ లో అజిత్ తో కార్తికేయ
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందిన “వాలిమై” ఫస్ట్ గ్లింప్స్…

నిర్మాతగా చేయడం ఓ గొప్ప అనుభవం
ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. అయితే ఆ మధ్య చాలా రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న అవికా మళ్లీ ఇప్పుడు సినిమాలపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలను చేసేస్తుంది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.

దసరాకు "#NANI 29 " మూవీ అనౌన్స్ మెంట్
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా కోల్ కత్తా నేపథ్యం లో తెరకెక్కిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి పల్లవి, కృతిశెట్టి , మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. హీరో నాని ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అంటే .. సుందరానికీ! మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నజ్రియా నజీమ్ కథానాయిక.

దసరాకు 'నాని 29' అనౌన్స్ మెంట్
న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం నాని చేతిలో శ్యామ్ సింగ్ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి. అందులోశ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంటే సుందరానికి సినిమా మాత్రం షూటింగ్ దశలోనే ఉంది.

గ్రాండ్ గా పూజాహెగ్డే బర్త్ డే
తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ", "ఆచార్య ", "రాధేశ్యామ్" మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం "సర్కస్ ", "భాయిజాన్ "(హిందీ ) "బీస్ట్ "(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "#SSMB28" మూవీ లో పూజ హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

సర్ ప్రైజ్ తో రానున్న 'శ్యామ్ సింగరాయ్'
ఏదైనా పండుగ వస్తుందంటే సినిమాల రిలీజ్ లు అలాగే కొత్త కొత్త అప్ డేట్ లతో సందడిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక దసరా పండుగ సందర్భంగా అప్ డేట్స్ తో రెడీగా ఉన్నారు అందరూ. అంతేకాదు కొంతమంది మేకర్స్ మాత్రం ఒకరోజు ముందే అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈనేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ టీమ్ కూడా సర్ ప్రైజ్ ప్లాన్ చేసి రెడీగా ఉంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ కూడా చేసింది. రేపు ఈసినిమా నుండి స్మాల్ సర్ ప్రైజ్ రానుందని.. ఈ దసరాను రాయల్ స్టైల్ లో సెలబ్రేట్ చేసుకుందామని పోస్ట్ లో పేర్కొన్నారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.

'ఆచార్య' పూజా లుక్ రిలీజ్
ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులే ఎదుర్కొంది. ప్రారంభంలో చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో పలు కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత అపజయాలను కూడా పట్టించుకోకుండా కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే బిజీ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమా చేస్తూనే మరోపక్క హిందీ, తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

బాలీవుడ్ లో ప్రభాస్ దూకుడు
బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందిన హీరో ప్రభాస్ స్టైలిష్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ తో బాలీవుడ్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా రూపొందే మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్ “మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో ప్రభాస్ ప్రస్తుతం “సలార్”, “ఆది పురుష్“మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ”…

"ఆచార్య" మూవీ రిలీజ్ డేట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

'సత్యాగ్రహి' అందుకే చేయలేదు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. మధ్యలో సినిమాలు చేయనని చెప్పినా తరువాత మాత్రం సినిమాలు కూడా స్టార్ట్ చేసి ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగించారు. ఇక ఇదిలా ఉండగా నేడు స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ జయంతి. ఇక ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జనసేన పార్టీపై జయ ప్రకాశ్ నారాయణ్ లోక్ నాయక్ ఇన్ఫ్లూయన్స్ చాలా ఉంది.. మీ రచనలు, మీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా ఉంటుంది.. ఇక ఈరోజు జయ ప్రకాశ్ నారయణ్ జయంతి నేపథ్యంలో జనసేన పార్టీ గ్రేట్ లీడర్ కు సెల్యూట్ చేస్తుంది. అంతేకాకుండా లోక్ నాయక్…

'ఆది పురుష్' కోసం విదేశీ నిపుణులు
ఓంరౌత్ దర్శకత్వంలో `ప్రభాస్ హీరోగా రామాయణం నేపథ్యంలో వస్తున్న సినిమా ఆది పురుష్. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా...కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఓం రౌత్ కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సైఫ్ తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నాడు కూడా. అంతేకాదు ఈ నెలాఖరు వరకు దాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.

'బిగ్ బ్రదర్' కు 'చిరు' బర్త్ డే విషెస్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూ వచ్చిన అమితాబ్ ఇప్పటికీ నటుడిగా పలు కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. ఇక నేడు అమితాబ్ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ రష్మిక
సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక…

'సలార్' మూడో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్న ప్రభాస్
మొత్తానికి ప్రభాస్ మాత్రం ఈసారి అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయడానికే ఫిక్స్ అయినట్టున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు లిస్ట్ లో ఉండగా రీసెంట్ గానే మరో సినిమాను కూడా ప్రకటించాడు. ప్రకటించడమే కాదు అదే స్పీడ్ లో షూటింగ్ లు కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆది పురష్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. ఇక దీనితో పాటు సలార్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు మూడో షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో మెజారిటీ భాగం భారీ యాక్షన్…

రెజీనా ట్విట్టర్ రికార్డ్
“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన రెజీనా ఇప్పుడు సూపర్ హిట్ "ఛత్రపతి " మూవీ హిందీ రీమేక్ "ఛత్రపతి " లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

బుడాఫెస్ట్ లో "ఏజెంట్"
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.