సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదితో పాటు హిందీలో కూడా చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నారు.శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.భాషాపరంగా తాను ఎలాంటి పరిమితుల్ని విధించుకోలేదని, నవ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ పాన్‌ఇండియా తారగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. రష్మిక టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ గా మారారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























