సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో ఆర్చిడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కర్రి బాలాజీ దర్శకత్వం లో పూర్ణ ప్రధాన పాత్రలో , తేజ త్రిపురాన హీరోగా రూపొందిన “బ్యాక్ డోర్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రణవ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవిశంకర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని “బ్యాక్ డోర్ “మూవీ దీపావళి కి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి “క్లీన్ యు” సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… “బ్యాక్ డోర్” మూవీ లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు. అన్ని వర్గాలప్రేక్షకులనీ అలరించే అంశాలు మెండుగా ఉన్నాయనీ , హీరోయిన్ పూర్ణతోపాటు, హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారనీ త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. తాను నటించిన “బ్యాక్ డోర్” క్లీన్ యు తో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: