జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” మూవీ 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బైక్ రేసింగ్ మరియు పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందిన “వాలిమై” ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాజిటివ్ పాత్రలు చేయడం కంటే, నెగిటివ్ రోల్స్‌ని పండించడం చాలా కష్టం. అయితే అలాంటి క్యారెక్టర్ట్ చేసినప్పుడే ఓ నటుడి టాలెంట్ బయట పడుతుంది. అందుకే మన యంగ్ హీరోస్‌లో చాలామంది నెగిటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హీరో నాని “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో విలన్ పాత్రలో నటించి కార్తికేయ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కార్తికేయ “వాలిమై” తమిళ మూవీ లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తానెంతో గర్వంగా చెప్పుకునే మూమెంట్స్‌లో ఇదొకటి అంటూ రేసర్ గెటప్‌లో అజిత్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోని కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అజిత్‌తో కార్తికేయ పోటీపడి మరీ నటించాడని, అతని పాత్ర కూడా హీరోతో సమానంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ చెబుతుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: