ఉయ్యాల జంపాల మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అవికా గోర్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కొన్ని విజయాన్ని అందించాయి.. అయితే చాలా సినిమాలు ఫ్లాప్స్ నే అందించాయి. అయితే ఆ మధ్య చాలా రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న అవికా మళ్లీ ఇప్పుడు సినిమాలపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అంతేకాదు ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా మారి సినిమాలను చేసేస్తుంది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గంధం మురళి నాగశ్రీనివాస్ దర్శకత్వంలో అవికా గోర్, సాయి రోనక్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా వస్తుంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్నచిత్రయూనిట్ ఇప్పుడు తాజాాగా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈసందర్భంగా అవికా మాట్లాడుతూ.. ‘మొదటిసారి ప్రొడ్యూస్ చేస్తూ ఉండటం ఓ గొప్ప అనుభవం. ఇది నాకు నటిగా మరింత సహనాన్ని నేర్పించింది. వ్యక్తిగా ఎలా ఎదగాలో కూడా చెప్పింది. నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను’ అంటుంది. కాగా ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం3 రూపొందుతోంది. మరి నిర్మాతగా అవిక ఏ మేరకు ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇంకా ఈసినిమాతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న అమరన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థ్యాంక్ యు” మూవీ లో అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























